రెబ్బెన : గ్రామాల్లో గుడుంబా తయారు చేసిన అమ్మకాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ ఐ విజయలక్ష్మి అన్నారు. పరిసర ప్రాంతాల్లో హోలీ పండుగను పురస్కరించుకుని తయారుచేస్తున్నారని పక్కా సమాచారం మేరకు జిల్లా అధికారి రాజ్యలక్ష్మి ఆదేశాలతో శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీ కోసం ఏర్పాటు చేసిన 100 లీటర్లు బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ కృష్ణమూర్తి కానిస్టేబుల్ సురేష్ మమత పాల్గొన్నారు.
No comments:
Post a Comment