Sunday, 1 March 2020

విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన


రెబ్బెన :   విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రెబ్బెన మండలం నక్కల కూడా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెబ్బెన ఎస్ఐ దీకొండ రమేష్  సి వి రామన్  చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  సి.వి.రామన్ ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త మనదేశంలో జన్మించడం మనకు గర్వకారణం కేవలం 150 రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని సంపాదించడం చాలా గొప్ప విషయం సర్ సి వి రామన్ గారు కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ దేశంలో ఎంతోమందికి సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించాయి విద్యార్థులు కూడా చిన్నప్పటి నుండే సైన్స్ పట్ల మంచి అవగాహన పెంచుకొని భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్,  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్,  విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment