రెబ్బెన ; మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటు, రిజర్వేషన్లతొ పాటు ప్రత్యేక హోదాలని కల్పిస్తూ మగవారితో సమానంగా ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో సమన్వయ పట్టుని ఇస్తుందని జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు కుందారపు శేంకరమ్మ అద్వర్యం లో ప్రధాన రహదారి లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడుతూ పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దాని ఫలితంగానే ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సీ టీములు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహిళా భద్రత కోసం ఎంతో తోడ్పాటు చేస్తుందని అన్నారు. అలాగే మహిళలు అందరు ఎంతో ఓర్పుతో ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని అన్నరు. అదేవిదంగా మహిళలు అందరు ఏ పనిలో ఐనా కూడా తమను తాము నిరూపించుకోవాలని అది రాజకీయాలు ఐన, ఉద్యోగంలో ఐన, ఇల్లాలిగా ఐన మన మహిళల్లో ఇంకా చైతన్యం రావాలి,మహిళలకు నాన్న తో పాటు భర్త సహకారం ఉండటం వల్లే మహిళాలు ముందంజలో ఉంటున్నారాని అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టాలు ఉన్నాయ్ అని పోలీస్ వ్యవస్థ కూడా వారి డ్యూటీ ని సక్రమంగా నిర్వర్తిస్తు, మహిళలకు సఖి కేంద్రాలను ఏర్పాటుతో పూర్తిగా రక్షణ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో మహిళల పాత్ర ఎన్నటికీ మరువలేనిదన్నారు కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఆనందోస్సవాంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి కి ఎఫ్ ఆర్ వో పూర్ణిమకు శాలువలతో సత్కరించారు. నక్కల కూడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ రూపొందించిన భారతీయ మహిళలు వారు సాధించిన విజయాలు పత్రాలను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సంతోష్ ఎంపీపీ సౌందర్య, మహిళా సర్పంచులు అహల్యా దేవి పోర్ట్ సుమలత దుర్గం రాజ్యలక్ష్మి వినోద వేమూరి అమృతా శాంత మాధవి యొక్క ఎంపిటిసి దుర్గం శ్రీవాణి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి ఎఫ్ఆర్వో పూర్ణిమ పి ఎస్ సి వైస్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు సోమశేఖర్ సర్పంచ్ శ్రీనివాస్ జాగృతి జిల్లా అధ్యక్షురాలు వినోద, సీనియర్ నాయకురాలు అరుణ , పద్మ, యశోద మండలం సర్పంచులు ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment