Monday, 9 March 2020

మద్యం సేవించి వాహనలు నడిపితే చర్యలు తప్పవు : ఎసై దీకోండ రమేష్

రెబ్బెన : మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని  ఎసై దీకోండ రమేష్ అన్నారు. సోమవారం  రెబ్బన మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎసై దీకోండ రమేష్ మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ నడపాలని అంతేకాకుండా వాహనానికి సంబంధించిన వాహన పత్రాలు అన్ని సక్రమంగా కలిగి ఉండాలని . ఆటోలో ఓవర్ లోడ్ తో నడపవద్దని డ్రైవర్లు మహిళపై దురుసుగా ప్రవర్తించవద్దని రూల్స్ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది.ద్విచక్ర ఆటో డ్రైవర్లు వాహనదారులు  పాల్గొన్నారు .

Sunday, 8 March 2020

ఆదివాసీ కొలవార్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం


బెజ్జుర్ మండల కేంద్రంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవని  ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు  బిబ్బెర భూమయ్య మహిళలను ఉద్దేశించి  మాట్లాడుతూ ఆదివాసీ రాణి దుర్గవతి ని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని స్త్రీ పురుషులు ఇద్దరు సమాజానికి రెండు కళ్ళ లాంటి వారని మహిళలు దేనికి కూడా తక్కువ కారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కానిస్టేబుల్ సూచరితను మరియు ఎంపీటీసీ పర్వీన సుల్తానా ను మహిళ మంటలను ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెజ్జుర్ మండల ప్రధాన కార్యదర్శి మండిగ.హనుమంతు అధ్యక్షులు పెద్దల.శంకర్, ఉపాధ్యక్షులు.డబ్బ.తిరుపతి, యూత్ అధ్యక్షులు మండిగ.చాటి, ప్రచార కార్యదర్శి పోల్క.వెంకటేష్, సాంసృతిక కార్యదర్శి మండిగ.సంతోష్, కొమురం భీం జిల్లా ARPS జనరల్ సెక్రెటరీ మండిగ.శ్రీనివాస్, బెజ్జుర్ మహిళ కానిస్టేబుల్ సుచారిత, MPTC జావిద్, సిడం.సక్కారం JAC పాల్గొన్నారు...

Saturday, 7 March 2020

అక్రమ నిర్మాణాలు ఆపాలి : ఆదివాసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

 బెజ్జూర్ : అధికారులు, పాలకులు  చట్టాలకు విరుద్ధంగా భూమి అక్రమాలకు పాల్పడుతూ స్థానిక ఏజెన్సీలోని ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్నారని కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిబ్బెర భూమయ్య అన్నారు. శనివారం  బెజ్జూర్ మండల ఆదివాసి కొలవార్ (మన్నేవార్) సేవా సంఘం నాయకులు కొమురం భీం విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.   బెజ్జుర్ మండల కమిటీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాజాగా చింతలమానేపల్లి మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చిన సంఘటనను ఖండిస్తూ  ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు GO MS NO:- 3 ఆర్టికల్ 342, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు ఉన్నప్పటికీ అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తున్న చింతలమానేపల్లి మండల తాసిల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1/70 పేసా చట్టాలకు రాజ్యాంగంలోని 5,6వ షెడ్యూల్ కు విరుద్ధంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నవారిపై వెంటనే (SC, ST) అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆగడాలను అరికట్టాలని అన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి దీనిపై స్పందించని యెడల రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బెజ్జూర్ మండల అధ్యక్షులు పెద్దల శంకర్, ఉపాధ్యక్షులు డబ్బ తిరుపతి, యూత్ అధ్యక్షుడు మండిగ చంటి,  యూత్ఉపాధ్యక్షులు బిబ్బెర రమేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించిన అప్పుడే అభివృద్ధి ; జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి

రెబ్బెన ;  మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటు, రిజర్వేషన్లతొ పాటు ప్రత్యేక హోదాలని కల్పిస్తూ మగవారితో సమానంగా ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో సమన్వయ పట్టుని ఇస్తుందని  జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు.  శనివారం రెబ్బెన మండల కేంద్రంలో మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు కుందారపు శేంకరమ్మ అద్వర్యం లో  ప్రధాన రహదారి లో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమనికి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడుతూ   పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దాని ఫలితంగానే ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సీ టీములు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహిళా భద్రత కోసం ఎంతో తోడ్పాటు చేస్తుందని అన్నారు.  అలాగే మహిళలు అందరు ఎంతో ఓర్పుతో  ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని అన్నరు. అదేవిదంగా మహిళలు అందరు ఏ పనిలో ఐనా కూడా తమను తాము నిరూపించుకోవాలని అది రాజకీయాలు ఐన, ఉద్యోగంలో ఐన, ఇల్లాలిగా ఐన మన మహిళల్లో ఇంకా చైతన్యం రావాలి,మహిళలకు నాన్న తో పాటు భర్త సహకారం ఉండటం వల్లే మహిళాలు ముందంజలో ఉంటున్నారాని అలాగే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టాలు ఉన్నాయ్ అని పోలీస్ వ్యవస్థ కూడా వారి డ్యూటీ ని సక్రమంగా నిర్వర్తిస్తు,  మహిళలకు సఖి కేంద్రాలను    ఏర్పాటుతో పూర్తిగా రక్షణ ఉందన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన లో మహిళల పాత్ర ఎన్నటికీ మరువలేనిదన్నారు కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడే తగిన గుర్తింపు ఉంటుందన్నారు.  కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఆనందోస్సవాంగా  జరుపుకున్నారు. ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి కి  ఎఫ్ ఆర్ వో పూర్ణిమకు శాలువలతో సత్కరించారు.  నక్కల కూడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ రూపొందించిన భారతీయ మహిళలు వారు సాధించిన విజయాలు  పత్రాలను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి  సంతోష్ ఎంపీపీ  సౌందర్య,  మహిళా సర్పంచులు అహల్యా దేవి పోర్ట్ సుమలత దుర్గం రాజ్యలక్ష్మి వినోద వేమూరి అమృతా శాంత మాధవి యొక్క ఎంపిటిసి దుర్గం శ్రీవాణి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి ఎఫ్ఆర్వో పూర్ణిమ పి ఎస్ సి వైస్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు సోమశేఖర్ సర్పంచ్ శ్రీనివాస్ జాగృతి జిల్లా అధ్యక్షురాలు వినోద, సీనియర్ నాయకురాలు అరుణ , పద్మ, యశోద మండలం సర్పంచులు ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గుడుంబా తయారీ పాల్పడితే కఠిన చర్యలు

రెబ్బెన :  గ్రామాల్లో గుడుంబా తయారు చేసిన అమ్మకాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్  ఎస్ ఐ విజయలక్ష్మి అన్నారు. పరిసర ప్రాంతాల్లో హోలీ పండుగను పురస్కరించుకుని తయారుచేస్తున్నారని పక్కా సమాచారం మేరకు జిల్లా అధికారి రాజ్యలక్ష్మి ఆదేశాలతో శనివారం దాడులు  నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీ కోసం ఏర్పాటు చేసిన 100 లీటర్లు బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.  ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ కృష్ణమూర్తి కానిస్టేబుల్ సురేష్ మమత పాల్గొన్నారు.

Friday, 6 March 2020

సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర

  రెబ్బెన : సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర  కార్యక్రమాలు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెబ్బెన ఎంపీపీ  జుమ్మి డి సౌందర్య ఆనంద్, జెడ్ పి టి సి  వేముర్ల సంతోష్ లు అన్నారు.    గురువారం రాజారాం గ్రామంలో  పల్లె నిద్ర చేశారా శుక్రవారం కార్యక్రమంలో భాగంగా  ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను  తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల   చెత్త వేయరాదు డంపింగ్ యార్డు లో మాత్రమే వేయాలన్నారు,నర్సరీ సందర్శించి మొక్కలు  సందర్శించారు.  అనంతరం  చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించాలని  అవగాహనకల్పించారు. సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తెలుకెళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్,ఎంపీటీసీ సంగం శ్రీనివాస్,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,mpo అంజడ్ పాషా,apo కల్పన,  తదితరులు పాల్గొన్నారు

చెత్త బుట్టల పంపిణీ

రెబ్బెన : మండలంలోని లక్ష్మి పూర్ గ్రామ పంచాయతీ లో  చెత్త బుట్టల  పంపిణీ  కార్యక్రమాన్ని   గురువారం సర్పంచ్ ఎలక్షన్ కోలా శ్యామ్ రావు  పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత లో భాగంగా పంచాయతీ తరపున అందజేస్తున్న చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  పబ్లిక్ టాక్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు గుట్టలతో బుట్టలను ఏర్పాటు చేసుకుని పరిశుభ్రతకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు.  పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్. పీల్డ్ అస్టెంట్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక శ్రద్ధతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి : జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై వి ఎస్ సుధీoద్ర

రెబ్బెన :  పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో  చదివి మంచి  మార్కులు తెచ్చుకోవాలని జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై వి ఎస్ సుధీoద్ర అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని నంబాల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా
పదవతరగతి విద్యార్థిని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా సామగ్రిని పంపిణీ  చెప్పారు అనంతరం మాట్లాడుతూ పబ్లిక్ పోటీ పరీక్షలకు విద్యార్థినివిద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో సిద్ధం కావాలని అప్పుడే మంచి మార్కులను సాదించగల్గుతారని..భావిభారత పౌరులు విద్యతోనే విజ్ఞానం,సామాజిక స్పృహ,ఆధునిక పరిజ్ఞానం పెంపొందించుకోగల్గుతారని అన్నారు.
అదేవిధంగా భారత రాజ్యాంగo ప్రతి పౌరునికి కల్పించిన, హక్కుల పై అవగాహన కల్గివుండలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, మండల సబ్ ఇన్స్పెక్టర్ దీకొండరమేష్, 
ఎంపీపీ  జుమ్మి డి సౌందర్య ఆనంద్, విద్యాశాఖఅధి వెంకటస్వామి,జెడ్పిటిసి సంతోష్, గ్రామ సర్పంచ్,సోమశేకర్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినివిద్యార్థులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tuesday, 3 March 2020

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

రెబ్బెన :  కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలనిఏ ఐ టి యు సి గోలేటి  బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు మంగళవారం బెల్లంపల్లి ఏరియా లోని  ఖైర్ గూడా  ఓపెన్ కాస్ట్ , బి పి ఏ ఓ సి టు ఏరియా వర్క్ షాప్ లొ వినతి పత్రాలు అందజేశారు.  అనంతరం మాట్లాడుతూ టీబీజీకేఎస్ గెలిచిన అప్పటినుండి కార్మికులపై పనిభారం పెరిగిందని కార్మిక హక్కులను కాపాడడంలో గుర్తింపు సంఘంగా విఫలమైందని కేవలం సంఘం గా మారిందని యాజమాన్య తో కుమ్మకై కార్మికుల పైన ఒత్తిడి పెంచుతున్నారు ఈ కార్యక్రమంలో గోలేటి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నరసయ్య బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి జగ్గయ్య శేషు వై సారయ్య చంద్రశేఖర్ మారం శ్రీనివాస్ ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

డి ఎం ఎఫ్ టి నిధులతొ సిసి రోడ్ల ప్రారంభం

  రెబ్బెన  :  రెబ్బెన మండలం లోని నంబాల గ్రామ పంచాయతీ అయ్యగారపల్లి లో మంగళవారం  డి ఎం ఎఫ్ టి నిధుల నుండి 3 లక్షలతో సి సి రోడ్డు పనులను సర్పంచ్ చెన్న సోమశేఖర్, వైస్ ఎం పి పి గజ్జల సత్యనారాయణ లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గ్రామ గ్రామాల అభివృద్ధి తెలంగాణ లక్ష్యమని గ్రామాల అభివృద్ధి పడ్డ అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి లక్ష్యంగా గా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీ అశోక్, వార్డు సభ్యులు కుమ్మరి మధు, సంజుకుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన

రెబ్బెన : పర్యావరణ పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సర్పంచ్ చెన్న సోమశేఖర్ వైస్ఎం పి పి గజ్జల సత్యనారాయణ లు అన్నారు. మంగళవారం  రెబ్బెన మండలం లోని నంబాల లో అడవులను అగ్ని  ప్రమాదాలు జరగకుండా పర్యావరణ పరిరక్షణ ఇబ్బందులు జరగకుండా అవగాహన  కల్పించారు. వాటికి సంబంధించిన గోడ పతులను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో బీట్ అఫిసర్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 1 March 2020

విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన


రెబ్బెన :   విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రెబ్బెన మండలం నక్కల కూడా ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెబ్బెన ఎస్ఐ దీకొండ రమేష్  సి వి రామన్  చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  సి.వి.రామన్ ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త మనదేశంలో జన్మించడం మనకు గర్వకారణం కేవలం 150 రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని సంపాదించడం చాలా గొప్ప విషయం సర్ సి వి రామన్ గారు కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ దేశంలో ఎంతోమందికి సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించాయి విద్యార్థులు కూడా చిన్నప్పటి నుండే సైన్స్ పట్ల మంచి అవగాహన పెంచుకొని భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్,  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్,  విద్యార్థులు పాల్గొన్నారు

మోకు దెబ్బ గౌడ జన జాతరను విజయవంతం చేయాలి

.
రెబ్బెన :  హైదరాబాద్ రవీంద్ర భారతి లో మార్చి 2న నిర్వహించే గౌడ జన జాతర రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు జువ్వాడి అనిల్ గౌడ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు దేవరకొండ సంతోష్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు సంఘం ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ గౌడ జన జాతర కు జిల్లా నలుమూలల నుండి గౌడ కులస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.