Tuesday, 3 November 2026

విశ్రాంత సింగరేణి ఉద్యోగులకు రెండు రోజుల అవగాహన

ఇంటివద్దే పెన్షన్‌, వైద్య సేవల ధ్రువీకరణ పునరుద్ధరణపై శిక్షణ

​రెబ్బెన, నవంబర్ 4, 

డిజిటల్‌ సర్టిఫికేట్‌ క్యాంపెయిన్‌ 5.0లో భాగంగా విశ్రాంత సింగరేణి ఉద్యోగులకు ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎం. శ్రీరమేష్‌ బుధవారం తెలిపారు. గోలేటి జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో సీఎంపీఎఫ్‌, సీపీఆర్‌ఎంఎస్‌ పునరుద్ధరణ విధానాలపై సింగరేణి అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ కోసం జీవన్‌ ప్రమాణ్‌, వైద్య సేవల కోసం హెల్త్‌ కార్డు పునరుద్ధరణను మీ సేవా కేంద్రాల్లో చేయించుకుంటున్నారని తెలిపారు. ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే విధానాన్ని వివరించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు ఆధార్‌, జీవన్‌ ప్రమాణ్‌, సీపీఆర్‌ఎంఎస్‌ పత్రాల ప్రతులను వెంట తీసుకురావాలని, తద్వారా అక్కడికక్కడే పునరుద్ధరణ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు.

No comments:

Post a Comment