అర్హులైన పేదలకు న్యాయం చేయాలి: స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొలేటి నాగేష్
రెబ్బెన, : నవంబర్ 3, మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొందని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొలేటి నాగేష్ అన్నారు. అర్హులైన పేదలకు అందాల్సిన పథకం గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులకే పరిమితమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన సమాచారం అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారుడి నివాస పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి విచారణ జరగడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎంపీడీవో స్థాయిలోనూ పారదర్శక సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని కోరారు. పంచాయతీ సిబ్బంది జాబితాలు, ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా కాకుండా పేదరికం, నివాస పరిస్థితులు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని నాగేష్ డిమాండ్ చేశారు. రెబ్బెన మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై సమగ్ర క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

No comments:
Post a Comment