Tuesday, 17 May 2022

వరి ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి




రెబ్బెన: రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ  జమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి వేముర్ల సంతోష్లు అన్నారు.   మంగళవారం రెబ్బెన మండలం  సహకార సొసైటీ లో పిఎసిఎస్, చైర్మన్ కర్నాతం సంజీవ్ కుమార్ , వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తగిన గిట్టుబాటు కి కొనుగోలు కేంద్రాలలో విక్రయించి నచ్చని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మొదటి రకం 1960 రెండో రకం1940 క్వింటా కి తీసుకుంటారని అన్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని 17 శాతం  ఉంటే గిట్టుబాటు ధర ఉంటుందని రైతులకు కు అవగాహన కల్పించారు.  ఆధార్ కార్డు జిరాక్స్ పట్టా పాస్ బుక్ జిరాక్స్ బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ లు  జత చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపిటిసి,మధునయ్య సర్పంచుల సంగం మండల అధ్యక్షుడు చెన్న సోమశేకర్, గంగాపూర్ ఆలయ చైర్మన్ ఓల్వోజి వెంకటేశం చారి, డైరెక్టర్లు కడ్తల మల్లయ్య, అజయ్ జెస్వాల్,టీఆర్ ఎస్ నాయకులు మోడెం సుదర్శన్ గౌడ్, మహిళ నాయకురాలు కుందారపు శంకరమ్మ,  రాపాల శ్రీనివాస్,సి ఈ ఓ సంతోష్, ఏ ఈ ఓ లు పరిమళ, శివకుమార్ లు పాల్గొన్నారు.

Wednesday, 4 May 2022

జై గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్


రెబ్బెన : జై గౌడ సంక్షేమ సంఘం  కొమరం భీమ్  జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్ ని ఎన్నుకున్నట్లు జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బుధవారం   తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంక్షేమ సంఘం  పురోగతి కోసం ఎంతో కృషి చేస్తానన్నారు. తన నియామకానికి కృషిచేసిన జై గౌడ  సంక్షేమ సంఘం వ్యవస్థాపకు అధ్యక్షులు బుర మన్సూర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్  గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Saturday, 8 January 2022

పేదలకు సేవ చేయడం ఎంతో గర్వకారణం

 రెబ్బెన :      పేదలకు సెవ చేయడం ఎంతో ఉన్నతమైనదాని, సర్పంచి అహల్యాదేవి, రెబ్బెన సి ఐ సతీష్ కుమార్, ఎస్సై పి భవాని సేన్ లు అన్నారు.  రెబ్బెన లో సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో పేద వారికి దుస్తులను , చీరలను శనివారం పంపిణీ  చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కూడా డా ఎన్నో రకాల వివిధ సేవా కార్యక్రమాలను సంస్థ ద్వారా చేయడం జరిగింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛత  పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా కరోనా  సమయంలో  సన్మానించడం  జరిగిందని,  అదేవిధంగా సంజీవని స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో  అధ్యక్షుడు దీకొండ సంజీవ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, మగవారికి  డ్రెస్సులు పంపిణీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భవిషతులో  ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని,  దానికోసం మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం పి టి సి సభ్యులు పెసర మద్దయ్య,సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ దీ కొండ సాయి తేజ,  సంజీవనిస్వచ్చంద అధ్యక్షుడు సంజీవ్ కుమార్,  సంజీవని స్వచ్ఛంద   రాజశేఖర్ ,తిరుపతి,  మహేందర్,  విజయ కుమారి శీభా , బొడ్డుప్రసాద్ లతోపాటు విద్యార్థులు ఉన్నారూ.

Sunday, 2 January 2022

అధికారుల ప్రోత్సహముతో అభివృద్ధి దిశలో--పి ఓ శ్రీనివాస్

  రెబ్బెన :   సింగరేణిలో రాత్రిమ్బావాళ్ళు పని చేస్తూ అభివృద్ధి దిశలో వెళ్తున్నామంటే దానికి కారణం జి ఎం సంజీవ రెడ్డి తో పాటు పై అధికారుల ప్రోత్సహమేనని ఖైరిగుడా ప్రాజెక్టు అధికారి ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతములో ప్రజానీకానికి ఉద్యోగ కల్ప తల్లిగా మారి ఎందరికో సింగరేణి తెలంగాణ తల్లిగా వెలసిల్లింది అని తెలిపారు . కార్మికులు , సుపెరువైజర్లు అధికారులు కలిసి కట్టుగా పనిచేస్తే కంపెనీ యాజమాన్యం పెట్టిన టార్గెట్ ను అధిగమించే విధంగా  అందరూ కృషి చేయాలని  అన్నారు. అదేవిధంగా  జీఎం ఆధ్వర్యంలో రక్షణ చర్యలు, కార్మిక సంక్షేమంపై దృష్టి సారిస్తూ , ఉత్పత్తిని సాధిస్తున్నామని అన్నారు. ఖైరిగుడా ఓపెన్ కాస్టులో ని కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.





Sunday, 5 December 2021

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు


కొమురం భీం ఆసిఫాబాద్ :  జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్  చంద్రశేఖర్ రెడ్డి  ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమెరి మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు కేరమేరి మార్కెట్ లో గల సాధ్ చావ్ సన్నాఫ్ సయ్యద్ చావ్, కి సంబదించిన కిరణ షాప్   లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు షాప్ లో తనిఖీలు  నిర్వహించగా షాప్ లో సుమారు 8000/- రూపాయల గుట్కా పాకెట్స్  పట్టుకొని కెరమెరి  పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి గుట్కా పాకెట్స్ ను సీజ్ చేసి కెరమెరి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.

NHM మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్



ఆసిఫాబాద్  :  ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఎన్. హెచ్.ఎం మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కొమురంభీం జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్ ను ఎన్నుకొన్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు,ఆసిఫాబాద్ లో ఈరోజు జరిగిన  జిల్లా ప్రతినిధుల సభలో ఎన్నుకొన్నారు,ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఎన్. హెచ్.ఎం స్కీఎమ్ లో పనిచేస్తున్న  ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారుఅన్నారు. 

Saturday, 4 December 2021

దేశి దారు పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు


కొమురం భీం ఆసీఫాబాద్ : జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్ చంద్రశెరఖర్ రెడ్డి ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు  ఆసిఫాబాద్ మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత దేశి దారు అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ లో నీ రవి చంద్ర కాలనీ లో కామ్రేడ్ ధనరాజ్ S/o బాబూరావు ఇంట్లో తనిఖీలు నిర్వించగ వారి ఇంట్లో విక్రయించడానకి సిద్దంగా ఉన్న మహరాష్ట్ర నుండి ప్రభుత్వ నిషేధిత దేశి దారు  90 ml బాటిల్స్ 44 ఉన్నాయి వాటి యొక్క సుమారు విలువ రూ 2640/- గా ఉంటుంది. వాటిని పట్టుకుని  ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి దేశి దారు బొట్టెల్స్ ను సీజ్ చేసి   ఆసిఫాబాద్  పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.

పరిపాలనలో విఫలమైన ప్రభుత్వాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు

ప్రారంభమైన జిల్లా రెండో మహాసభలు


ఆసిఫాబాద్  :  పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు అన్నారు.  జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో శనివారం ప్రారంభమైన జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి 

అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల పాలనలో ప్రజలను పీల్చిపిప్పి చేశాయని అన్నారు. దేశంలో మత వాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి పబ్బం గడుపుకుంటున్నదని అన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతు చట్టాలు, కార్మిక చట్టాలు, విద్యుత్ సంస్కరణలు లాంటి వాటి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు 8 గంటల పని దినాలు తీసుకువస్తే మోడీ ప్రభుత్వం చట్టాలను సవరించి 12 గంటలకు పెంచిందన్నారు. గడిచిన ఏడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 1256 చట్టాలు సవరించినదన్నారు. పార్లమెంటులో చర్చించి చట్టాలు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు చేస్తున్నారని ఇది మంచిదికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని దీనికి నిదర్శనమే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పన్ను 31 శాతం నుండి 22 కు తగ్గించారన్నారు. దేశంలో పుట్టిన వ్యక్తులకు వారసత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మత విశ్వాసాల ఆధారంగా ఓటు హక్కు ఇచ్చే విధంగా సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. వామపక్ష పార్టీలు ఇతర దేశాలకు మద్దతు పలుకుతానని ఆరోపించడం సరికాదని స్వాతంత్రోద్యమ సమయంలో పూర్తి స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసిన పార్టీ తమదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కరోనాపై నెట్టుతుందని ప్రజలకు పోషకాహారం అందించడం, టీకా వేయడంలో విఫలమైందన్నారు. మొదటి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో మరణాలు నమోదు కాలేదని దీనికి కారణమే ఆ రాష్ట్రం ప్రజలకు పోషకాహారంతో కూడిన కిడ్స్ అందించడమే కాకుండా, ప్రతి ఒక్కరికి రెండు డోసులు టీకా వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మిగులు రాష్ట్రాన్ని నేడు 41 కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందని నేడు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలను అణిచివేసే దిశగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని తెలిపారు. రాష్ట్రంలో పోడు సాగుదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ కేవలం ఒక తంతు లాగ నడుస్తుందని ఇలా కాకుండా ప్రతి సాగుదారునికి పట్టాలు అందించాలన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా నాయకత్వం పనిచేయాలన్నారు. పార్లమెంటరీ పోరాటాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. పోడు భూముల పై తీర్మానం ప్రవేశ పెడుతూ జిల్లా సభ్యుడు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ పోడు భూములకు సంబంధించి ప్రముఖ పాత్ర పోషించాలని, కానీ అటవీ అధికారులు వారిపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు ప్రతి పోడుసాగుదారునికి పట్టాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు జిల్లా ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి అట్టడుగు స్థాయిలో ఉందని అన్నారు. ఎక్కువ మంది గిరిజనులు నివాసం ఉంటున్న జిల్లాలు విద్య వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఆ దిశగా కృషి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వామపక్ష పార్టీగా తమపై ఉందన్నారు. జిల్లాలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి కార్మికులు కర్షకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు పస్తం ఆనంద్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, మధు, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ కుశాన రాజన్న, జిల్లా కమిటి సభ్యులు అల్లూరి లోకేశ్, కోట శ్రీనివాస్ దుర్గం దినకర్, ముంజం శ్రీనివాస్, గొడిసెల కార్తీక్, నైతం రాజు చాపిలె సాయికృష్ణ భీమేష్ ఉమ్మడి జిల్లా నాయకులు ఎన్.వి. రమణ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

 రెబ్బెన  :  వన్యప్రాణుల సంరక్షణ పై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని సంరక్షించే  విధంగా సహకరించాలని రెబ్బెన అటవి క్షేత్ర అధికారి పూర్ణిమ అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల అటవీ శాఖ కార్యాలయంలో  మండల పోలీస్,రెవెన్యూ,విద్యుత్, మండల పరిషత్తు ఉన్నత అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ పూర్ణిమ మాట్లాడుతూ  వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చడం వలన సామాన్య ప్రజలు ప్రాణాలు కొల్పతున్నారని, అలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు భాద్యతయుతంగా వ్యవహరించాలని కోరారు. అటవీ సంపద అయిన వన్యప్రాణులు, చెట్లు,ఇసుక తరిగి పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.  అటవీ సంపదను దోచుకున్నట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై భవాని సేన్, పి ఎస్ ఐ సరిత,  ఏ పీ ఓ కల్పన,విద్యుత్తు అధికారులు పాల్గొన్నారు.

మాస్క్ తప్పనిసరి లేకపోతే జరిమానా : ఎస్ఐ భవానీ సేన్

  రెబ్బెన : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపద్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని   రెబ్బెన ఎస్ ఐ భవానీ సేన్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో  మాట్లాడారు. , వ్యాక్సిన్  మొదటిసారి మరియు రెండవ సారి తప్పనిసరిగా తీసుకొని మాస్కో ధరించాలని సూచించారు.  ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో,   మాస్కులు ఖచ్చితంగా ధరించాలని లేనియెడల    వెయ్యి  రూపాయలు జరిమానా విధి ఇస్తామన్నారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి  గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వీయ రక్షణ,  కోవిడ్19  నిబంధనలు  పాటిస్తూ   ప్రజలు  మాస్క్ ధరించి సహరించాలనీ కోరారు.

Tuesday, 22 June 2021

నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు : రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్



 రెబ్బెన : నకిలీ విత్తనాలు క్రయవిక్రయాలు జరిపిన వారిపై  పీడీ యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ఉంటాయి అని రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్ అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిభంధనల ప్రకారం,  కొమురం భీం జిల్లా ఆసిఫాబాదు డి‌జి‌పి   ఎస్‌పి Y.V.S సుధీంద్ర ఆదేశాల మేరకు  పోలీస్ సిబ్బంది ,వ్యవసాయ అధికారి సిబ్బంది  సహాయముతో మద్వైగుడా గ్రామంలో తనిఖీ  చేయగాఅలగం శ్రీనివాస్ దగ్గర ఒక కింట 50 కిలోల గ్రాసిల్  నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 2లక్షల 40 వేలు ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో నకిలీ విత్తనాల సరఫరా విక్రయాలు జరిపే వారిపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు.  గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.  ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం  అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జుమీడి పరిమళ ,పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Monday, 9 March 2020

మద్యం సేవించి వాహనలు నడిపితే చర్యలు తప్పవు : ఎసై దీకోండ రమేష్

రెబ్బెన : మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని  ఎసై దీకోండ రమేష్ అన్నారు. సోమవారం  రెబ్బన మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎసై దీకోండ రమేష్ మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ నడపాలని అంతేకాకుండా వాహనానికి సంబంధించిన వాహన పత్రాలు అన్ని సక్రమంగా కలిగి ఉండాలని . ఆటోలో ఓవర్ లోడ్ తో నడపవద్దని డ్రైవర్లు మహిళపై దురుసుగా ప్రవర్తించవద్దని రూల్స్ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది.ద్విచక్ర ఆటో డ్రైవర్లు వాహనదారులు  పాల్గొన్నారు .

Sunday, 8 March 2020

ఆదివాసీ కొలవార్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం


బెజ్జుర్ మండల కేంద్రంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవని  ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు  బిబ్బెర భూమయ్య మహిళలను ఉద్దేశించి  మాట్లాడుతూ ఆదివాసీ రాణి దుర్గవతి ని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని స్త్రీ పురుషులు ఇద్దరు సమాజానికి రెండు కళ్ళ లాంటి వారని మహిళలు దేనికి కూడా తక్కువ కారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కానిస్టేబుల్ సూచరితను మరియు ఎంపీటీసీ పర్వీన సుల్తానా ను మహిళ మంటలను ఆదివాసీ కొలవార్ (మన్నెవార్) సేవా సంఘం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెజ్జుర్ మండల ప్రధాన కార్యదర్శి మండిగ.హనుమంతు అధ్యక్షులు పెద్దల.శంకర్, ఉపాధ్యక్షులు.డబ్బ.తిరుపతి, యూత్ అధ్యక్షులు మండిగ.చాటి, ప్రచార కార్యదర్శి పోల్క.వెంకటేష్, సాంసృతిక కార్యదర్శి మండిగ.సంతోష్, కొమురం భీం జిల్లా ARPS జనరల్ సెక్రెటరీ మండిగ.శ్రీనివాస్, బెజ్జుర్ మహిళ కానిస్టేబుల్ సుచారిత, MPTC జావిద్, సిడం.సక్కారం JAC పాల్గొన్నారు...