జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
కొమరం భీమ్ : ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:
ప్రభుత్వం జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు సమాజ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనకు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన అందించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కళాశాలలో చేయవలసిన మరమ్మత్తులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్. ఆర్. కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, లబ్ధి పొందిన వారు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు సకాలంలో అందించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment