Sunday, 2 January 2022

అధికారుల ప్రోత్సహముతో అభివృద్ధి దిశలో--పి ఓ శ్రీనివాస్

  రెబ్బెన :   సింగరేణిలో రాత్రిమ్బావాళ్ళు పని చేస్తూ అభివృద్ధి దిశలో వెళ్తున్నామంటే దానికి కారణం జి ఎం సంజీవ రెడ్డి తో పాటు పై అధికారుల ప్రోత్సహమేనని ఖైరిగుడా ప్రాజెక్టు అధికారి ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతములో ప్రజానీకానికి ఉద్యోగ కల్ప తల్లిగా మారి ఎందరికో సింగరేణి తెలంగాణ తల్లిగా వెలసిల్లింది అని తెలిపారు . కార్మికులు , సుపెరువైజర్లు అధికారులు కలిసి కట్టుగా పనిచేస్తే కంపెనీ యాజమాన్యం పెట్టిన టార్గెట్ ను అధిగమించే విధంగా  అందరూ కృషి చేయాలని  అన్నారు. అదేవిధంగా  జీఎం ఆధ్వర్యంలో రక్షణ చర్యలు, కార్మిక సంక్షేమంపై దృష్టి సారిస్తూ , ఉత్పత్తిని సాధిస్తున్నామని అన్నారు. ఖైరిగుడా ఓపెన్ కాస్టులో ని కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.





No comments:

Post a Comment