Sunday, 5 December 2021

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు


కొమురం భీం ఆసిఫాబాద్ :  జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్  చంద్రశేఖర్ రెడ్డి  ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమెరి మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు కేరమేరి మార్కెట్ లో గల సాధ్ చావ్ సన్నాఫ్ సయ్యద్ చావ్, కి సంబదించిన కిరణ షాప్   లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు షాప్ లో తనిఖీలు  నిర్వహించగా షాప్ లో సుమారు 8000/- రూపాయల గుట్కా పాకెట్స్  పట్టుకొని కెరమెరి  పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి గుట్కా పాకెట్స్ ను సీజ్ చేసి కెరమెరి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment