Saturday, 4 December 2021

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

 రెబ్బెన  :  వన్యప్రాణుల సంరక్షణ పై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని సంరక్షించే  విధంగా సహకరించాలని రెబ్బెన అటవి క్షేత్ర అధికారి పూర్ణిమ అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల అటవీ శాఖ కార్యాలయంలో  మండల పోలీస్,రెవెన్యూ,విద్యుత్, మండల పరిషత్తు ఉన్నత అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ పూర్ణిమ మాట్లాడుతూ  వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చడం వలన సామాన్య ప్రజలు ప్రాణాలు కొల్పతున్నారని, అలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు భాద్యతయుతంగా వ్యవహరించాలని కోరారు. అటవీ సంపద అయిన వన్యప్రాణులు, చెట్లు,ఇసుక తరిగి పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.  అటవీ సంపదను దోచుకున్నట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై భవాని సేన్, పి ఎస్ ఐ సరిత,  ఏ పీ ఓ కల్పన,విద్యుత్తు అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment