Friday, 9 February 2018

పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ్యత్వ నమోదు

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 9 ;  పంచాయితీ రాజ్  ఉపాధ్యాయుల సంఘం ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా గురువారం కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పతాక ఆవిష్కరణ గావించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.  అనంతరం జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలైన ఏకీకృత సేవ నియమాలు ఉపాధ్యాయుల పదోన్నతులలో,మెడికల్ రేయింబర్సుమెంట్ మొదలైన సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడి  సాధించిన తమ సంఘాన్ని మరింత బలపరచాలని కోరారు.  రాష్ట్ర   శాఖ  పిలుపు మేరకు   ఈ నెల 22న మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి  వచ్చి విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు ఆడే ప్రకాష్, జనార్దన్, బిక్షపతి, శంకర్, రాకేష్, యాదగిరి, గోవిందరావు, శ్రవణ్ శ్రీనివాస్, సత్యనారాయణ, సాంబశివరావు, సత్తెన్న తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment