కొమరం భీమ్ జిల్లా: శ్యామ్ మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. కొమరం భీమ్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పిహెచ్సి ఆరోగ్య కేంద్రంలో నిన్న రాత్రి గొల్లగూడెం కు చెందిన మొగిలి చిన్నాన్న కుమారుడు శ్యామ్ (నాలుగు సంవత్సరాలు) పాము కాటు వేయడంతో వైద్యం అందక మరణించాడు. బుధవారం హాస్పటల్ సందర్శించిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ మాట్లాడుతూ రాత్రి 11:30 కు హాస్పిటల్కు తీసుకువచ్చిన వైద్యం అందించకపోవడంతో , ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో వారు హుటాహుటిన బైకుపై బెల్లంపల్లి హాస్పిటల్ కి చేరుకున్న కొద్ది నిమిషాలకే మృతి చెందడం జరిగింది. రెబ్బెన హాస్పిటల్లో సరైన వైద్య సిబ్బంది లేకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడం , ఉన్న సిబ్బంది వారు మధ్యాహ్నానికే ఇంటికి వెళ్లడం జరుగుతుందని, వీరీ పై అధికారుల పర్యవేక్షణ కరువైందని అన్నారు. రెబ్బెన మండలంలో సుమారుగా 80000 జనాభా ఉంటుందని రేబ్బెన నేషనల్ హైవేపై ఎప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి ఒకే ఒక్క డాక్టర్ నియమించడం ఆ డాక్టర్ కి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించడంతో రెబ్బెన మండల ప్రజలకు సరైన వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనిఅన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సోయిలేదని దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ ఆసుపత్రిలో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని, అసలే వర్షాకాలం ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండి అందుబాటులో ఉండవలసి ఉండగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా చిన్నారి బాలుడు మృతి చెందడానికి వైద్య సిబ్బంది కారణం. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించి రోగుల ప్రాణాలను కాపాడాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం .ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ , లక్షింపూర్ మాజీ సర్పంచ్ కోలే శ్యామ్ రావు. ఎనగంటి శ్రీశైలం. చౌదరి సుభాష్. కాశవేణి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment