Friday, 9 February 2018

కొత్తగా అర్హులైనవారు ఓటరు గా పేరు నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ ఫిబ్రవరి 11న ప్రత్యేక జాతీయ ఓటరు దినోత్సవం




 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 9 ; ఓటర్ జాబితాలో పేరు లేనివారు, కొత్తగా అర్హులైనవారు, సవరణలు  చేసుకొనే వారు తప్పకుండ పేరు నమోదు చేసుకోవాలని రెబ్బెన తహశీల్ధార్ సాయన్న  తెలిపారు. ఆదివారం ఫిబ్రవరి 11 న  ప్రత్యేక  జాతీయ ఓటరు  నమోదు దినోత్సవం సందర్బంగా పేరు నమోదు చేసుకొనే వారు ఆధార్ కార్డు , 2 ఫొటోలుతీసుకోని  రావాలని తెలిపారు. 14 వ   తేదీ తో  ఈ ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. ఆదివారం నాడు  సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 వరకు అందుబాటులో అంటారన్నారు.  నమోదు, మార్పులు, సవరణలకు సంబంధించి . 6 7 8 ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు . ఈ అవకాశాన్ని18 సంవత్సరాలు నిండిన అందరు  సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.

No comments:

Post a Comment