కొమురం భీం ఆసిఫాబాద్ (మా ప్రతినిధి) ఫిబ్రవరి 14 ; అంగన్వాడీ టీచర్ల 2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే2వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బుధవారం మహాసభ గోడప్రతులను సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు లోకేష్, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం దినకర్ లు విడుదలచేశారు. రాజంపేట అంబెడ్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 18,19 వ తేదీలలో జరిగే మహాసభలకు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పద్మ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు అనిత, పుష్పలత, సువర్ణ, సునీత, సరోజ, లీల, శారద, కమల, సులోచన,రజని, మంజుల,రమ,శోభ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment