Saturday, 3 February 2018

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3;  ఆలయ ఫౌండేషన్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నాడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ  మోడల్ పాఠశాల, ఆసిఫాబాద్ హై స్కూల్ లోని పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ లు మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్ లు నిర్వహించడం వలన భవిష్యత్తు పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగ పడటమే కాకుండా వారిని ప్రోత్సహించవచ్చని వారు అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ మండల అధ్యక్ష,కార్యదర్శులు నాయిని సాయిరాం, పిప్పిరిరాంసాయి, జిల్లెల్ల మహేందర్, గడ్డం అరవింద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment