Monday, 11 March 2019

బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి


రెబ్బెన :   బిజెపి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం 4. గంటలకు గోలేటి సెయింట్ ఆగ్నెస్ స్కూల్  నిర్వహించబడునని సోమవారం ఓ ప్రకటనలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.    ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి చాడా శ్రీనివాసరెడ్డి హాజరవుతారు ఈ సమావేశానికి జిల్లా పది అధికారులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరు హాజరు కాగలరలని కోరారు.

నూతన పట్టాధార్ పాస్ పుస్తకాలను అందించాలని జిల్లా పాలానాధికారికి రైతుల వినతి.

రెబ్బెన :  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే తర్వాత కొత్త పట్టాధార్  పాస్ పుస్తకాలు చాల మంది రైతులకు అందలేదని రెబ్బన మండలంలోని గంగాపూర్ గ్రామా రైతులు సోమవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందజేశారు.  అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టా పుస్తకాలు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ నిధి పథకాలు కోల్పోయామని అన్నారు. కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి ప్రభుత్వాల నుండి వచ్చే పెట్టుబడి పథకాలను అందించాలని రైతులు కోరారు. నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వొలువోజు వెంకటేశం, శ్యామ్రావు, గందె సంతోష్, లావుడ్య బిక్కు, కిషన్, రమేష్, లక్ష్మిభాయ్,తార భాయ్, రైతులు  తదితరులు పాల్గొన్నారు.     

పాతూరి సుధాకర్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలి

రెబ్బెన : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాయిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో పాతూరి సుధాకరరెడ్డి పాత్ర మరువలేనిది అని అన్నారు. అధ్యాపకుల వేతనాలు పెరగడంతో పాటు, 12 నెలలు వేతనం రావడం లాంటి అనేక సమస్యలు పరిష్కరించబడినవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఒప్పంద అధ్యాపకులు ప్రవీణ్, రామారావు, వెంకటేశ్వర్, ప్రకాష్, మహేష్, అమరేందర్, మంజుల, పద్మ, ఝాన్సీ తదితరులు  పాల్గొన్నారు.

Wednesday, 6 March 2019

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నత శ్రేణులకు ఎదగాలి ; జిల్లా ఎస్పీ మల్లారెడ్డి



 

రెబ్బెన ;   విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉన్నత శ్రేణులకు ఎదగాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు.  బుధవారం రెబ్బెన మండలంలోని రెబ్బెన ఆర్ట్ & సైన్స్  కళాశాలలోబుధవారం  ఏర్పాటు చేసిన ఎనిమిదవ  వార్సకోశావ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వచ్చాక ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆసక్తి గల రంగాల్లో రాణించాలన్నారు.  విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలు పట్టకుండా సెల్ఫోన్లతో కాలయాపన చేయకుండా విద్యపై ఆసక్తి చూపించి పై రంగాల్లో రాణించాలన్నారు విద్యార్థులు కళాశాలలో పాఠాలు చెప్పేటప్పుడు ముఖ్యమైన సందేశాలను నోటు పుస్తకంపై రాసుకుని చదువుకోవాలన్నారు. మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఆసక్తిగల రంగాల్లో విద్యార్థులు ముందుకు వెళ్లి మంచి  స్థానాల్లో ఉండాలన్నారు ప్రతి రోజూ వచ్చే వార్తా పత్రికలోని ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలని సూచించారు అలాగే సమాజం మనకు చాలా నేర్పుతుంది దాని ముందు మంచిని స్వీకరించి కాలానికి అనుగుణంగా మారుతూ ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీపీ సంజీవ్ కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కళాశాల కరస్పా టీ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్  జాకీర్ ఉస్మాని, విమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, ఎస్డీ రమేష్, డైరెక్టర్లు దేవేందర్రావు శ్రీధర్రావు మరియు కళాశాల సిబ్బంది వాచర్లు పాల్గొన్నారు

Monday, 4 March 2019

శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు






రెబ్బెన ;    మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శైవ క్షేత్రాలలో  శివ నామ  స్మరణ మరు మ్రోగాయి. రెబ్బెన  మండలము లోని నంబాల గ్రామము  లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతర రంగ రంగ వైభవంగా సాగింది. ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి  వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు. కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు. ఈ పూజలలో  దంపతులు  స్వామి వారి  కళ్యాణం లో పాల్గొన్నారు.  . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ జాతర లో వచ్చిన భక్తులకు  కొంతమంది  దాతలు  అన్నప్రసాద  వితరణ  గావించారు.  . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు  కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా  కొరకు  ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ  పోలీసుశాఖవారు  భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు.
కన్నుల పండుగగా  రధోత్సవం ;- 

రెబ్బెన ;  శివ పర్వతుల రధోత్సవం  ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో  లో భక్తులు తండోప  తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు. శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది. అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు. సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను  మంత్ర ముగ్దులను చేసింది. అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ  గడిపారు.