దేవాపూర్ సల్పలవాగులో ఆదివాసీల సంప్రదాయ వేడుకలు
బెల్లంపల్లి, : నవంబర్ 4, కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పలవాగు ప్రాంతంలో నిర్వహించిన ఆదివాసీల సంప్రదాయబద్ధమైన దండారి దర్బార్ ఉత్సవాలకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ పెద్దలు, స్థానిక నాయకులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కాసిపేట మండల అధ్యక్షుడు రమణారెడ్డి, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు సత్యపాల్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి