స్మారక జెండా ఆవిష్కరణ.. విగ్రహానికి నివాళులర్పించిన ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్,:నవంబర్ 4, జిల్లా రాజ్‌గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో కుమురం భీం స్మారక జెండా ఆవిష్కరణతో పాటు వర్ధంతి వారోత్సవాలను బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై స్మారక జెండాను ఆవిష్కరించారు. అనంతరం కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు కుమురం భీం అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగాలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. కుమురం భీం ఆశయాల సాధనతో పాటు ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఆయన చూపిన పోరాట బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అంకుసాపూర్ సర్పంచ్ టేకం గంగారాం, వగుదాం సర్పంచ్ జూగాదిరావు, సమేలా సర్పంచ్ సంతోష్, మాజీ ఎంపీపీ మోతిరాం, డీసీసీ కార్యవర్గ సభ్యుడు పెందూర్ సుధాకర్, శిడం అర్జు, మాడవి రఘునాథ్, గురనులే నారాయణ, ఉప్పుల కృష్ణ, బాజీరావు, మారుతి, చందన్ షా, జిల్లా రాజ్‌గోండ్ సేవా సమితి నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి