కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 ; విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఒక నిముషం మౌనంపాటించి నివాళులర్పించారు. అనంతరం కాళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొంటున్నప్పుడే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన దిశగా అడుగు వేసి సాధిస్తే జీవితం సుఖమయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. పరీక్షలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమెంటో లు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపాల్ అతియా ఖానం, లెక్చరర్ శాంత, రెబ్బెన కళాశాల అధ్యాపకులు ప్రకాష్, గంగాధర్, సతీష్, శ్రీనివాస్, అమరేందర్, ప్రవీణ్, మంజుల, వెంకటేశ్వర, మల్లేశ్వరి, వరలక్ష్మి, దీప్తి, నిర్మ్యాల, సంధ్య, ఝాన్సీ, మహేష్, కృష్ణ మూర్తి, సరళ, సిబ్బంది ప్రకాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment