కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4 ; బెల్లంపల్లి ఏరియాలోని 9 ఆర్ అండ్ ఆర్ సెంటర్ యువకుల కోసం మంగళవారం రెబ్బెన మండలం గోలేటి శ్రీ భీమన్న గ్రౌండ్ నందు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలను మంగళవారం ఉదయం పది గంటలకు జనరల్ మేనేజర్ రవిశంకర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. తదుపరి సింగరేణి సేవా సమితి వారి ఆధ్వర్యంలో గోలే టౌన్షిప్ మరియు మాధారం టౌన్షిప్లలో నివసించే కార్మికుల వారి పిల్లలకు మోటర్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోర్సులను సింగరేణి సేవ సంస్థ అధ్యక్షులు శ్రీమతి అనురాధ రవిశంకర్ జండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.
No comments:
Post a Comment