Saturday, 14 April 2018

భారత రత్న బాబా సాహెబ్ అంబెడ్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;  బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలోడా: బి ఆర్ అంబేద్కర్ 127వ జయంతి  ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. :సింగరేణి ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ ఆధ్వర్యంలో శెనివారం  జీఎం   కె రవిశెంకర్ సింగరేణి జనరల్ మేనేజర్, గోలేటి కార్యాలయ ఆవరణ లో బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈసందర్బంగా జియం రవి శెంకర్ మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్నిసింగరేణి కార్యాలయలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతి నాడు వేతనంతో కూడిన సెలవు దినాన్ని ప్రకటించారన్నారు.బి ఆర్ అంబేద్కర్ గురించి తెలుపుతూ అంబేద్కర్ మహామేధావి అని  ఎన్నో డిగ్రీలుచదివారని అయన చూపిన బాటలో అందరూ నడవాలన్నారు  అందరికి సమాన న్యాయం  ఉండాలని పోరాటం చేసి సాధించారన్నారు.అంబేద్కర్ బోధనలు అందరూ అనుసరించాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలోఓ టూ   జిఎం ఎం శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్లు కె కొండయ్య, ఎం మోహన్ రెడ్డి, సిఎచ్ శ్రీనివాసులు,  టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ రావు, డిజిఎం పర్సనల్ జె కిరణ్, డీవైపీఎంలు ఏ  రాజేశ్వర్ ,రామశాస్త్రి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  కుందారపు  శెంకరమ్మ  సింగరేణి ఎస్టీ ఎంప్లాయిస్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోడ భద్రు, వైస్ ప్రెసిడెంట్  హీరాలాల్, సెక్రెటరీ సంజీవ్ జాదవ్, మరియు సభ్యులు ఎస్సీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్  పి గోపాలకృష్ణ సెక్రెటరీ కాటం లక్ష్మణ్, ఎస్టీ అడ్వైజర్ కె కిరణ్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ ఎం రాములు,సీనియర్ సేవాసమితి సభ్యులు తదితరులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment