Sunday, 4 March 2018

ఎన్నికల హామీల అమలుకై ధర్నా: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాండ్రే విశాల్



  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 4 ;  తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకై సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాండ్రే  విశాల్ అన్నారు. ఆదివారం కొమురంభీం ఆసిఫాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  ఎన్నికల ముందు దళితులకు మూడు ఎకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, డబల్ బెదురూమ్ వంటి   హామీలను ఇచ్చి  అధికారంలోకి వచ్చి  నాలుగేండ్లయినా అమలుచేయక పోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జేబీ  పౌడెల్ ముఖ్య అతిధి గాపాల్గొంటారన్నారు. ఆసిఫాబాద్ మండలంలోని  అన్ని బూత్ స్థాయి నాయకులూ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ,ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులూ రాధికా, పడిగేల విజయ్ కుమార్, రాజు,ఉమేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment