Thursday, 29 March 2018

మానవ హక్కుల చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి ; ఎస్సె శివకుమార్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 29 ; మానవ హక్కుల చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని ఎస్సె శివకుమార్ అన్నారు. గురువారం సివిల్ రైట్ దినోత్సవం సందర్బమంగా గోలేటిలోని ఆశ్రమపాఠశాలల్లో పౌరహక్కుల ఎస్సీ ఎస్టీ చట్టాలపై రెబ్బన పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సె శివకుమార్ మాట్లాడుతూ  ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం రూపకల్పనలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మానవ హక్కుల చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పెన్నులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవినాయక్, వార్డెన్ దేవయ్య, గ్రామ పెద్ద బలరామ్ నాయక్,సీఆర్పీ సత్యనారాయణ,నాయకులు ఆత్మారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment