Tuesday, 13 March 2018

చౌక ధర దుకాణంలో సరకుల పంపిణి జాప్యం ; సరకులు రవాణా లో అలసత్వం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 13 ;   ప్రజా పంపిణి దుకాణంలో సరకుల పంపిణీలో జాప్యం జరుగుతుందని కొమురంభీం జిల్లా  రెబ్బెన మండల  గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం  రేషన్ షాప్ కు వెళ్లి లైన్ లో నిల్చుంటే  మధ్యాహ్నం వరకు సరకుల పంపిణి జరుగలేదని వాపోయారు. రేషన్ దుకాణంలో సరకులకోసం రెండు మూడు రోజులు పడితే దినకూలీలమైన మేము రోజు కూలి నష్టపోవాల్సి వస్తుందని  వాపోయారు. దీనికి కారణం ఈ పాస్ యంత్రం సరిగా పనిచేయకపోవడమేనని  అన్నారు. రేషన్ షాప్ డీలర్ శ్రీపతిని వివరణ కోరగా  ఈ నెల ఒకటిన రావలసిన సరకులు  పదకొండున వచ్చాయని, ఈ పాస్ యంత్రం మొరాయించడంతో జాప్యం జరుగుతోందన్నారు. సరకులు సకాలంలో రానందువల్ల మరియు మూడురోజులు సమయం ఉండడంతో రద్దీ ఎక్కువైందని తెలిపారు. జిల్లా బయో మెట్రిక్ ఇంచార్జి తిరుపతి మంగళవారం ఈ పాస్ విధానాన్ని పరిశీలించి ప్రధాన సర్వర్  సాంకేతిక లోపంతో జాప్యం జరిగిందని తెలిపారన్నారు. ఈ విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారన్నారు.  

No comments:

Post a Comment