కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 విశిష్టమైన పని తీరు తోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పి గోద్రు అన్నారు. శనివారం జిల్లా లోని పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరం లో మార్చి నెల మాసంతమున పదవి విరమణ పొందిన ఏఎస్సై జాడే బాపు( ఈస్గాం పోలీస్ స్టేషన్) , హెడ్ కానిస్టేబుల్ నైతం లాలు ( ఏ ఆర్ హెడ్ క్వార్టర్) లను జిల్లా అడిషనల్ ఎస్పి పదవి విరమణ సందర్బంగా పూలమాల వేసి శాలువాతో సత్కరించి గిఫ్ట్ బాక్స్ ను అందచేశారు, పదవి విరమణచేసిన ఉద్యోగులు మాట్లాడుతూ వారి యొక్క సర్వీస్ నందు గడచిన స్మృతులను, ఎదుర్కున్న సవాళ్లను మరియు తోటి మిత్రులతో చేసిన విధులను పోలీస్ శాఖ తమకు ఇచ్చిన ఆత్మ విశ్వాసం ను మరియు సమయపాలన గురించి మాట్లాడారు. అనంతరం అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ 35 సంవత్సరాల సర్వీస్ లో పోలీస్ శాఖ కు అందించిన సేవలు విశిష్టమైనవి అని వాటిని మరువలేమని అన్నారు, ఇక ముందు వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో ఆనందం తో గడపాలని అభిలషించారు, పోలీస్ శాఖ తరుపున వారి యొక్క పెన్షన్ పత్రము లను వారికి అందచేశారు,ఇంకా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను వారికి త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రంలో A.O భక్త ప్రహ్లాద్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు,ఐటి కోర్ ఇన్స్పెక్టర్ స్వామి , రిజర్వు ఇనస్పెక్టర్ యం. శ్రీనివాస్, డి.పీ.ఓ. ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్, ఫింగర్ ప్రింట్ ఇంచార్జ్ తిరుపతి పి.ఆర్.ఓ మనోహర్ మరియు విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 31 March 2018
హనుమాన్ జయంతి ఉస్సవాలు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; హనుమాన్ చిన్న జయంతి సందర్బంగా హనుమాన్ మాల ధరించిన భక్తులు ఉదయం దేవాలయం పూజారి సత్తెన్న శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని నిర్వహించారు. కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం లోని గోలేటి శ్రీ కోదండ రామాలయంలో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ సేవా సమితి గోలెం విలాస్,జనగామ విజయ్,మూడెడ్ల సురేందర్ రాజు ,పోటు శ్రీధర్ రెడ్డి,యం సతన్న, తదితరులు పాల్గొన్నారు.
102 శాతం ఉత్పత్తి సాధించిన బెల్లంపల్లి ఏరియా
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 నిర్దేశించిన లక్ష్యానికి మించి 102 శాతం ఉత్పత్తి సాధించినట్టు బెల్లంపల్లి ఏరియా సింగరేణి జెనరల్ మేనేజర్ రవిశెంకర్ తెలిపారు. శెనివారం రెబ్బెన మండలం గోలేటి జియం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో బెల్లంపల్లి ఏరియా సింగరేణి 2017-2018 సంవత్సరానికి గాను ఉత్పత్తి వివరాలను తెలిపారు. 70 లక్షల టన్నుల ఉత్పత్తి కి గాను 71.3233 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు 102 శాతం ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు. మార్చ్ నెలకు గాను కైరుగూడ ఓసీ 3.33,000 వేల టన్నుల లక్ష్యం కాగా 3,41,915 టన్నుల ఉత్పత్తి సాధించినట్టు పేర్కొన్నారు. ఓసీ 2,1, 000 టన్నులకు గాను 93, 478 టన్నుల ఉత్పత్తి 78 శాతం జరిగిందన్నారు. డోర్లి1, 2 లక్షల 30 వేల టన్నులకు గాను 2 లక్షల 30 వేళా 576 టన్నులు.100 శాతం ఉత్పత్తి జరిగినట్టు తెలిపారు. ఉత్పత్తి సాధనకు కృషి చేసిన కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికుల సమిష్టి కృషితోనే 102 శాతం ఉత్పత్తి సాధ్యమైనట్టు తెలిపారు, ఈ ఏడాది 92 కోట్లతో నిర్మించిన సీఎస్పీ ప్రారంభమైనట్లు తెలిపారు.13వ తేది నుండి వేణుగోపాల్ మెమొరియల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో ఎస్ఓటు జియం శ్రీనివాస్ ,డిజిఎం పర్సనల్ జె కిరణ్ ,ఐఈటి యోహాన్,తదితరులు పాల్గొన్నారు.
ఆపద్భాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; ఆపద్భాందవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శనివారం మండలంలోని గురుడ్పేట గ్రామంలో మాజీ ఎంపిపి నికాడు గంగారాం కొడుకు విష్ణుమూర్తికి ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోవడంతో ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రెండు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆదుకునే దేవుడిలాగా మన ముఖ్యమంత్రి పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలోప్రజలకు పాలన దగ్గర కావాలని ఉద్దేశంతో పాలనాపరమైన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు, మండలాలు, ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చేనెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా పరిశ్రమల శాఖమంత్రి తారకరామారావు కాగజ్ నగర్ రానున్నట్లు ఆయన తెలిపారు. గతంలో విష్ణుమూర్తికి ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయించారానీ , ముఖ్యమంత్రి నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చేసినందుకు విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ విశ్వనాథ్, జడ్పీటిసి డప్పుల నానయ్య, ఐటిడిఏ డైరెక్టర్ కుమ్రం మాంతయ్య ఆరెఎస్ఎస్ మండల అధ్యక్షుడు మేర్పల్లి బ్రహ్మయ్య, యాదవ సంఘం మండల శాఖ అధ్యక్ష ఉపాధ్యక్షుడు గట్టయ్య, సంతోష్, సీనియర్ నాయకులు నక్క శంకర్ నాయకులు గుర్రం శ్రీధర్, పసునూరి తిరుపతి, సకినాల సురేష్, బండి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, ఎస్సై రాజు కుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన కల్యాణ మండపం ప్రారంభం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; ఆసిఫాబాద్ కేస్లాపూర్ హనుమాన్ మందిరం ప్రాంగణం లో 10 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపము ను శనివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురసఙ్కారించుకొని ప్రేత్యేక పూజలు నిర్వహించారు.
ఎం ఎల్ ఆ దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ విజ్ఞానం ఎంతగా విస్తరిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడితేనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమము లో వాంకిడి జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు రావు , గంధం శ్రీనివాస్ , గదవేని మల్లేష్ , ఎంపీటీసీ లు మామిడి లక్ష్మి , సుగుణాకర్ , చిలివేరి వెంకన్న , గుండా వెంకన్న , కోవా సాయినాథ్ , జీవన్ , భక్తులు ,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మజ్జిగ పంపిణీ ని ప్రారంభించిన ; మాజీ ఎమ్మెల్యే సక్కు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 ; హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని ఆసిఫాబాద్ కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద అర్ అర్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పద్మావతి జువెల్లర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి చేసారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మజ్జిగ పంపిణి కార్యక్రమాన్నీ ప్రారంభించారు. అంతకముందు హనుమాన్ ఆలయంలో ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జలిమ్ షా ,నాయకులు సంతోష్,విలాస్ తదితరులు పాల్గొన్నారు
Friday, 30 March 2018
గోలేటి లో ఉచిత వైద్య శిబిరం
రెబ్బెన మండలోని గోలేటి లో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏప్రిల్ ఒకటవ తేదీన ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ నుండి సూపర్ స్పెషలిస్టు న్యూరోలాజి, మరియు కార్డియాలజీకి సంబంధించిన డాక్టర్లు వస్తున్నారని సింగరేణి బెల్లంపల్లి ఏరియా డీజీఎం పర్సనల్ కిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాలోని కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, గుండె మరియు నరాల సంబంధిత వ్యాధులు గల కార్మికులు, మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతినెలా ఒకటవ మరియు నాలుగవ ఆదివారాలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
సిపిఎం జాతీయ మహాసభల పోస్టర్ల విడుదల

కొత్త పంచాయతీల ఏర్పాటుపై కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 30 ; రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో తెరాస నేతలు క్షీరాభిషేకం చేసారు. ఈ సందర్భంగా నాయకులూ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజల అందుబాటులోకి పంచాయితీల సేవలు రావాలని భావించి కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, సర్పంచులు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య, నాయకులూ మద్ది శ్రీనివాస్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, అశోక్, శాంతి కుమార్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సంజీవిని సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 30 ; రెబ్బెన మండలంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సంజీవని సేవా సంస్థ ఆధ్వర్యములో రోగులకు పండ్లను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దీకొండ సంజీవకుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్చ్చంద సంస్థ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. మండలంలోనే కాకుండా జిల్లాలోనే మరెన్నో సేవా కార్యక్రమాలకు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి స్టాప్ నర్సు భాగ్యలక్ష్మి, హోమియో వైద్యురాలు సరిత మరియు సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కొల్లి సునీల్ కుమార్, పర్వతి సాయికుమార్, దీకొండ సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
Thursday, 29 March 2018
మానవ హక్కుల చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి ; ఎస్సె శివకుమార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 29 ; మానవ హక్కుల చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని ఎస్సె శివకుమార్ అన్నారు. గురువారం సివిల్ రైట్ దినోత్సవం సందర్బమంగా గోలేటిలోని ఆశ్రమపాఠశాలల్లో పౌరహక్కుల ఎస్సీ ఎస్టీ చట్టాలపై రెబ్బన పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సె శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం రూపకల్పనలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు మానవ హక్కుల చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పెన్నులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవినాయక్, వార్డెన్ దేవయ్య, గ్రామ పెద్ద బలరామ్ నాయక్,సీఆర్పీ సత్యనారాయణ,నాయకులు ఆత్మారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏరియా తరలుతున్నదున ఏజీఎంకు ఘన సన్మానం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 29 ; సింగరేణి భవన్ డిపార్ట్మెంట్లో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్న ఈ నెల 31 వ తేదిన ఉద్యోగ విరమణ పొందుతున్న తిరుమలరావును గురువారం బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ తరపున డివైపిఎం సుదర్శన్ శాలువా కప్పి పూల మలతో ఘనంగా సన్మానించినట్లు డిజిఎం పర్సనల్ కిరణ్ తెలిపారు. ఏరియాకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా తిరుమలరావు అందించిన సేవలు ఎల్లప్పుడు నిలిచి ఉంటాయన్నారు. అనుభవజ్జులైన అధికారులు ఉద్యోగ విరమణతో సంస్థకు దూరం అవుతున్నరని అయితే విధి నిర్వహణలో అందించిన సేవలు మాత్రం చిరకాలం నిలిచి ఉంటాయన్నారు.
తెలుగు దేశం 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 29 ; తెలుగు దేశం 37 వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా రెబ్బెన మండలంలోని గోలేటి లో జెండా ఎగురవేసారు. అనంతరం టిడిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి మాట్లాడుతు తెలుగుదేశం ప్రభుత్వ హయం లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి బడుగు బలహీన వర్గాలు కు చేయూత అందిందన్నారు.ఇప్పుడున్న తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది అన్నారు. తెలుగు నైజం గురించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ `కి మంచి భవిష్యత్తు ఉందని నాయకులు కార్యకర్తలు అదర్య పడవద్దు అని సూచించారు. తెలుగు దేశం ప్రజల పక్షన వుంటూ సమన్యాయం చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ గుడిమెర్థ హన్మంతరావు,,మండలాధ్యక్షుడు విజయ్,విమలక్క, కాజల్,కే శ్రీనివాస్,నాందేవ్ తదితరులు పాల్గొన్నారు
స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 29 ; సింగరేణి సేవ సమితి అందించే స్వయం ఉపాధి అవకాశాలను ఉపయోగించుకోవాలని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశెంకర్ అన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ కమ్మినికెషన్ సెల్ అద్వర్యం లో నిర్మిస్తున్న ఆణిముత్యాలు షూటింగ్ లో భాగంగా క్లాప్ కొట్టి ప్రారంబించారు. టెలి ఫిలింషూటింగ్ ఈ నెల 26 వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశెంకర్ మాట్లాడుతూ భూ నిర్వాసితులైన ఆర్ ఆర్ సెంటర్ వారికీ అందించే స్వయం ఉపాధి కోర్సుల గురించి వివరించారు. టైలరింగ్ సెంటర్ పై జరుపుతున్న షూటింగ్ ను. అదేవిదంగ ఆర్ ఆర్ సెంటర్స్ వారికీ టైలరింగ్,అగర్ బత్తి ,రెగ్జిన్ బ్యాగ్స్ లాంటి వాటిలో మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అలాగే యువకులకు మోటార్ డ్రైవింగ్, తేనెటీగల పెంపకం మొదలగు వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏరియా లోని పునరావాస కాలనీల్లో కల్పిస్తున్న వసతులు,కార్మిక కుటుంబాలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు టెలిఫిలిమ్ ద్వారా షూటింగ్ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యాక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్, డి వై పియం రాజేశ్వర్ కెమెరామెన్ వెంకట స్వామి కమ్మినికెషన్ సెల్ కోఆర్డినేటర్ డి కూమార స్వామి ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు.
దిన, వార, పశువుల సంత ల వేలం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 29 ; ఆసిఫాబాద్ గ్రామపంచాయితీపరిధిలోని దినసంత వేలం పాటలో రూపాయలు 8,10,500 కు ఆత్రం దిలీప్, వార సంత వేలం పాటలో 7,71,000 రూపాయలకు కే జాలింష , మరియు పశువుల సంత ను వేలంపాటలో రూపాయలు 1,60,000 కు బానోత్ ప్రేమలాల్ లు దక్కించుకున్నట్లు ఆసిఫాబాద్ పంచాయితీ కార్యదర్శి చెప్పారు. ఈ వేలంపాటల కార్యక్రమంలో ఆసిఫాబాద్ గ్రామ సర్పంచ్,మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 29 ; సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్వో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బుధవారం గోలేటి టౌన్ షిప్ లో జీఎం కార్యాలయంలో జీఎం రవి శంకర్ సర్ట్ఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ భూనిర్వాసితులతో పాటు కార్మికుల, మాజీ కార్మికుల పిల్లలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సంస్థ అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు . ఇందులో భాగంగా సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణను అందించామన్నారు. ఇటువంటి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భవిష్యత్తులో ఉపాధికి మరింత అవకాశాలు ఏర్పడుతాయని అన్నారు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ దశలవారీగా శిక్షణ అందజేస్తామన్నారు. కార్మిక సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పేందుకు కార్మికులు మాజీ కార్మికుల పిల్లలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలే నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్ పీవో మనోహర్ మోహన్ రెడ్డి డివైపిఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 28 March 2018
హలో కుమ్మర చలో మంచిర్యాల సభ గోడ ప్రతుల విడుదల
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; మంచిర్యాల లో ఎప్రిల్ 1న నిర్వంచనున్న ఉమ్మడి జిల్ల కుమ్మరుల బహిరంగ సభను విజయవంతమ్ చేయలని కొమురమ్ భీమ్ జిల్ల కుమ్మరి సంగం అధ్యక్షులు కుమ్మరి మల్లేష్ .ప్రధాన కార్యదర్సి కటికనపెల్లి మొండి కోరారు. రెబ్భన మండల కేంద్రం లో భుదవారం జిల్లా కార్యవర్గ ఆద్వర్యంలో హలో కుమ్మర చలో మంచిర్యాల సభ గోడ పత్రులు విడుదల చేసారు .కుమ్మరుల హక్కుల సాదన కోసం గ్రామ మండల స్తాయి నుంచి కుమ్మరులు అధిక సంఖ్యలో ఈ సభలో పాల్గోని విజయవంతం చేయలని కోరారు.
పాఠశాల లో అదనపు తరగతి గది ప్రారంభం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల నందు అదనపు తరగతి గదిని బుధవారం జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్ లు ప్రారంభించారు.ఏ సందర్భంగా పాఠశాలా నిర్వహణపై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకించారు. విద్యార్థిని విద్యార్థులను సౌకర్యాలపై అది తెలుసుకున్నారు. పాఠశాలా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, పాఠశాలా ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, సి ఆర్ పి దేవేందర్, ఉపాధ్యాయులు సదానందం, అశోక్, కవిత, జంగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; రెబ్బెన మండలం పుంజుమ్మెరా గ్రామంలో రెబ్బెన మండల బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కార్యాలయ ఆవరణలో చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రంచేసారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఖాండ్రే విశాల్ ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామా గ్రామానికి విస్తరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల అధ్యక్షులు ఇగుర పు సంజీవ్, నాయకులూ గుండయ్య, విజయ్ కుమార్, కంట రావు, వెంకటేష్, రమేష్, రవీందర్, తైతరులు పాల్గొన్నారు.
Tuesday, 27 March 2018
ఉపాధి హామి పనులు ప్రారంభం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 27 ; రెబ్బెన గ్రామ పంచాయితి లో గల నక్కలగుడ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులకింద రైతుల వ్యవసాయ భూముల కు వెళ్లే దారి నిర్మాణ పనులను రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొడెం భీమన్న గుడి నుండి మొయిన్ కెనాల్ వరకు దారి పనులకు 4,91,144/-రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ యొక్క రోడ్డు పనులు రైతులకు ఎంతగానో ఉపయొగపడుతయని రైతులకు ఉపయొగపడే పనులను ఉపాధి హామి పథకం ద్వార అభివృద్ది చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య, ఫీల్డ అసిస్టెంట్లు తుకారాం, తిరుపతి, ఉపాధి హామి కూలీలు పాల్గొన్నారు.
సి పి ఐ మహాసభల గోడ ప్రతుల విడుదల
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 27 ; ఏప్రిల్ ఒకటవ తేదినుండి నాల్గవ తేదీవరకు హైదరాబాద్ లో జరగనున్న సిపిఐ మహాసభలకు సంబందించిన గోడ ప్రతులను మంగళవారం కొమురంభీం జిల్లా రెబ్బెన, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మండలాల్లో విడుదల చేసారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే ఉపేందర్, మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్యలు విడుదలచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలు ఎంతో కస్టపడి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా మరచి, ప్రజలను, నిరుద్యోగులను, రైతులను మోసంచేసిందన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత చిచ్చులను రేకెత్తించి దేశాన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కుందారపు బసవయ్య, రెబ్బెన సిపిఐ మండల కార్యదర్శి రామడుగు శంకర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, నాయకులూ శ్రీనివాస్, కిషన్, గణేష్, కేదారి, శంకర్, పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడిగా కుందారపు బసవయ్య
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 27 ; తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా రెబ్బెన మండలంలోని చెందిన కుందారం బసను ఎన్నుకోవడం జరిగిందని కొమురంభీం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదిన పార్టీ జిల్లా రెండవ మహా సభలోతెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగపశ్య పద్మ, సి పి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూండా మల్లేష్ ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త న మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో రైతుసమస్యలపై, వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామని అన్నారు .
వార సంత వేలం పాట వాయిదా
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 27 ; రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి గురువారం నిర్వహించే వార సంత వేలం పాటను వాయిదా వేసినట్లు పంచాయితీ కార్యదర్శి శెంకర్ తెలిపారు. మంగళవారం జరగాల్సిన వేలంపాటకు పోటీదారులు హాజరు కానందున తిరిగి 3వ తేదీన ఉదయం 12 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయితీ కార్యదర్శి శెంకర్ తెలిపారు ఆసక్తి గల వారు రూ :10 వేల ధరావతు చెల్లించి పంచాయితీ కార్యాలయం లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు
Monday, 26 March 2018
అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయరాదు ; తహశీల్దార్ సాయన్న
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 26 ; ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ సాయన్నఅన్నారు. సోమవారం రెబ్బెన తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడరు. మండలంలోని లేతన్ గూడా మరియూ గొల్లగూడ పరిసర ప్రాంతాల్లో డంప్ చేసిన సుమారు పద్దెనిమిది ట్రాక్టర్ల ఇసుక కుప్పలను పోలీసుల సమాచారం మేరకు సీజ్ చేసినట్లు తెలిపారు సీజ్ చేసిన ఇసుకను త్వరలోనే వేలం పాట నిర్వహిస్తామన్నారు ట్రాక్టర్ యజమానులు అనుమతి తీసుకున్న ప్రాంతం నుండే ఇసుకను తరలించాలని ఇసుకను పక్కదారి పట్టించి ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ రెండుసార్లు పట్టుబడిన జరిమానా విధించడం జరుగుతుందన్నారు ఆపై అక్రమ రవాణా తప్పిన ట్రాక్టర్లను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ కేంద్రకమిటీ లో బెల్లంపల్లి ఏరియాకు సముచిత స్థానం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 26 ; ఏఐటీయూసీ కేంద్రకమిటీ లో బెల్లంపల్లి ఏరియాకు చెందిన పలువురు నాయకులకు స్తానం దక్కిందని బెల్లంపల్లి ఏరియా గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు.సోమవారం గోలేటిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల లో భూపాలపల్లిలో లో జరిగిన ఏఐటీయూసీ 15 వ మహాసభలో కేంద్ర కార్యవర్గ సభ్యులుగా తిరుపతి , మొగిలి , బి జగ్గయ్య, జి నరసింహ రావు లను నియమించినట్లు తెలిపారు. అలాగే కేంద్ర కౌన్సిల్లో వై సారయ్య, శేషశయన రావు, జూపాక రాజేష్ లకు అవకాశమిచ్చినట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటి కప్పుడు స్పందిస్తూ, తక్షణమే వాటి పరిష్కారానికి పోరాటాలు సాగించే సంస్థ ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కేంద్రకమిటి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మిక సోదరుల అభ్యున్నతికి నిరంతరం పాటు పడతామని అన్నారు. కేంద్ర కమిటీ లో బెల్లంపల్లి ఏరియాకు సముచిత స్తానం ఇచ్చినందుకు కృతసజ్ఞతలు తెలిపారు.
సింగరేణి క్రీడాకారులను మరింత ప్రోత్సహహించాలి : జీఎం రవిశంకర్
అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణం


Sunday, 25 March 2018
సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి : సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 25 ; ఏప్రిల్ 1 తేదీ నుండి 4 తేది వరకు హైదరాబాద్ లో జరిగే సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రెబ్బెన మండల కార్యదర్శి రయిల్లా నర్సయ్య అన్నారు. రెబ్బెన మండల లోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన,ప్రజల హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసింది సీపీఐ పార్టీ అని అన్నారు. రాష్ట్ర మహాసభలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హాజరు అవుతారని తెలిపారు, అలాగే ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్యాలు ఘోరంగా విఫలమైందని అన్నారు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని,మండలం లోని అర్హులు అయిన అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, రైతుల పెట్టుబడికోసం ఎకరానికి 10వేలు ఇవ్వాలని, పెండింగులో ఉన్న మరుగుదొడ్లు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు, ఈ సమావేసం లో సీపీఐ రెబ్బెన కార్యదర్శి రామడుగుల శంకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కుందారపు బసవయ్య, నాయకులు సాగర్, సతీష్, మల్లయ్య తో పాటు తదితరులు ఉన్నారు.
పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం


Saturday, 24 March 2018
సింగరేణి కార్మిక క్వాటార్లలో విద్యుత్ చర్జిలు రద్దు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; సింగరేణి కార్మిక నివాస గృహలలో విద్యుత్ చర్జిలు విధించటానికి సంస్థ రద్దు చేసినట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మాల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం రెబ్బెన మండల గోలేటిలోని విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి క్వాటార్లలో నివాసం ఉండే కార్మికులు ప్రతి నెలా సంస్థ విధించే విద్యుత్ చార్జీలను నేటి నుండి రద్దుచేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ గత నెలలో శ్రీరాంపూర్లో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన విధంగా సింగరేణి యాజమాన్యం విద్యుత్ చార్జీలను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సంస్థలో పనిచేస్తున్న నలభై వేల మంది కార్మికులకు నెలకు రూపాయలు ఐదొందల నుండి జన్మింతురు ప్రయోజనం పొందుతుందన్నారు కెసిఆర్ ద్వారా సింగరేణి సంస్థకు మనుగడ కార్మికులు భరోసా ఏర్పడుతున్నరు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండల కేంద్రంలోని వకులం పెద్దవాగు సమీపంలో శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు సుమారు అరవై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఓంటిపై తెల్లని బనీను నీలి రంగు గీతలతో కూడిన చెడ్డి (నిక్కరు) ధరించి ఉందని, వాగు వడ్డీపై తెల్లని రంగు షర్టు ఆరవేసి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బట్టి చూస్తే రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లు అభిప్రాయపడ్డారు. మృతుడికి సంబంధించి పూర్తివివరాలు తెలియరాలేదని మృతుడు బంధువులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు.
క్షయ వ్యాధిపై అవగాహనా ర్యాలీ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రెబ్బెన మండల ప్రాధమిక ఆరోగ్య కంద్రం సిబ్బంది మరియు ఆశాకార్యకర్తలు ఆరోగ్య కేంద్రం ఎదురుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ క్షయ ఒక భయంకరమైన జబ్బుఅయినా దీనికి చికిత్స ఉంది భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఉన్నట్లయితే దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని, వ్యాధి నిర్ధారణ ఆయన వెంటనే చికిత్స అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, అన్నపూర్ణ అరుణ , హెల్త్ వర్కర్లు వి పావని, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, కమల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ పాఠశాలలలో 9, 8 తరగతులలో ప్రవేశాలు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ;కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో గన్నారం మైనారిటీ పాఠశాలలో ఈ విద్య సంవత్సరం 2018 నుండి నుండి 9 తరగతిలోకి ప్రవేశాలు, అలాగే ఆసిఫాబాద్ మండలంలోని బాలికల మైనారిటీ పాఠశాలలో 2018 నుండి 8 వ తరగతి లోకి ప్రవేశాలు, మొదలైనట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ సెక్రటరీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు మండలాలలోని తల్లి తండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలలో చదివించడానికికాగజ్నగర్ లో ఎం ఎల్ ఏ కోనేరు కోనప్ప ఏర్పాటు చేసిన ఉచిత సహాయ కేంద్రంలో తమ పిల్లల ఆధార్ కార్డు, రెండు ఫోటోలు మరియు బోనఫైడ్ లు తీసుకోని నవాజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగ, కాగజ్ నగర్ లోని కేంద్రంలో సంప్రదించగలరని అన్నారు.
పశువుల సంత10. 42 వేలకు వేలం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో పశువుల వార సంత కు శనివారం వేలం పాట నిర్వహింహించారు. రెబ్బెన కి చెందిన సయ్యద్ అఫ్రోజ్ అలీ 10 లక్షల 42 వేలకు సొంతం చేసుకున్నట్లు ఈ ఓ పి ఆర్డీ కిరణ్, తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు వార సంతకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, పంచాయితీ కార్యదర్శి శ్వేత, గ్రామస్తులు పాల్గొన్నారు.
27న గోలేటి వార సంత వేలం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 24 ; రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి గురువారం నిర్వహించే వార సంత 2018 - 19 సంవతస్సర నిర్వహణకు గాను ఈ నెల 27వ తేదీన ఉదయం 12 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ పంచాయితీ కార్యదర్శి శెంకర్ తెలిపారు ఆసక్తి గల వారు రూ :10 వేల ధరావతు చెల్లించి పంచాయితీ కార్యాలయం లో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.
Thursday, 22 March 2018
పశువుల సంత 24న వేలం పాట
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; రెబ్బెన మండలంలోని గంగాపూర్ పంచాయతికి చెందిన ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల సంత 2018-19 సం నిర్వహణ కోసం ఈ నెల ఇరవై నాలుగో తేదీన 11;30 గం,, లకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వేలంపాట నిర్వహించినట్లు గంగాపూర్ సర్పంచ్ మంచం రవీందర్, కార్యదర్శి శ్వేతలు గురువారం తెలిపారు. ఆసక్తి గల వారు 20000 దరవుత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైలు కింద పడి వృద్ధుడి మృతి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో గురువారం గుర్తు తెలియని రైలు కింద పడి ఆసిఫాబాద్ కంచుకోట గ్రామనికి చెందిన జంజిరాల సత్తయ్య అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కాగజ్నగర్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బి మురళీ తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం సత్తయ్య గత నాలుగు సంవత్సరాలుగా నడుము నొప్పితో బాధపడుతు ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన సత్తయ్య గురువారం ఉదయం రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిపాబాద్ రైల్వే స్టేషన్ల గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లో సి పి ఐ (ఎం) సెమినార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; సి పి ఐ (ఎం) అఖిల భారత మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో ఈ నెల 25 న సెమినార్ జరగనున్నదని కొమురంభీం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు కూస రాజన్నగురువారం తెలిపారు. ఈ సెమినార్ లో తెలంగాణ రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సెమినార్ లో వక్తలుగా తమ్మినేని వీరభద్రం సి పి ఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఎం ఎల్ సీ ,విజు కృష్ణన్ అఖిలభారతియా కిసాన్ సభ జాతీయ కార్యదర్శి, ఎస్ వీరయ్య, ఎడిటర్ నవ తెలంగాణ తెలుగు దినపత్రిక, డాక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమలో అల్లూరి లోకేష్, దుర్గం దినకర్, వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నిషేదిత గుట్కా , మద్యం పట్టివేత
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; నిషేదిత గుట్కా మరియు బెల్ట్ షాప్ ల వ్యాపారం చేయవద్దని స్పెషల్ టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు అన్నారు. ముందస్తు సమాచారంతో జిల్లా ఎస్ పి కల్మేశ్వర్ సింగనావర్ ఆదేశాల మేరకు గురువారం కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఆత్మకూరు నరేష్ నడుపుతున్న దుకాణంలో సుమారు 14, 530 రూపాయల విలువగల నిషేదిత గుట్కాలు, సుమారు 10,900 విలువ గల మద్యం సీసాలను స్వాధీనపరచుకున్నామన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. వీరితో పాటు ఎస్సై శివకుమార్, పోలీస్ సిబ్బంది వెంకట్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
అక్రమంగా ఇసుక లారీ పట్టివేత
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; అక్రమంగా ఇసుక తరలిస్తున్న నెంబర్ ఏపీ01ఎక్స్ 2979 గల లారీని గురువారం రెబ్బెన పోలీసులు లేతన్ గూడా రైల్వే గేట్ వద్దనుండి ఆదిలాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారిపై పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ ఎస్ కే జమీల్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. తగిన పత్రాలు లేకుండా ఇసుకను రవాణా చేయకుడదని ఎస్సై అన్నారు.
Wednesday, 21 March 2018
కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయం పెంపుపై హర్షం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను రెబ్బెన లో ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మహిళలతో కలసి మిథైయులు పంచుకొని హర్షాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలుచేయని వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో హామీలను నెరవేరుస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో మంది ఆడపిల్లల తల్లి తండ్రులు కుల మత వివక్షలేకుండా లబ్దిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం అద్మా, అన్నపూర్ణ అరుణ, కాలివేణి లక్ష్మి, పిల్లి లతా, సుగుణ, పార్వతి, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా దుర్గం రవీందర్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యునిగా గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ ను ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ మాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్ లో జరిగిన సిపిఐ జిల్లా మహసభలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. రవీందర్ ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా విద్యారంగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నడని అంతేకాకుండా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికై పోరాటాలు నిర్వహిస్తున్నడని అన్నారు. రవీందర్ మాట్లాడుతూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తానని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర,జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల విశ్వాసం గెలుచుకునేలా మన పనితనం వుండాలి – జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; ప్రజల విశ్వాసం గెల్చుకునేలా మన యొక్క పనితనం వుండాలని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెన వార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా హెడ్ క్వార్టర్ లోని పెరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పి మరియు అడిషనల్ ఎస్పి గోద్రులు నూతనంగా జిల్లా కు కేటాయించబడిన( 63 సివిల్ + 61 ఎఆర్ =124 )మంది కానిస్టేబుల్ లతో పరిచయ కార్యక్రమము ను నిర్వహించారు, ఈ సమావేశం లో జిల్లా ఎస్పి మాట్లాడుతూ శిక్షణ లో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితం లో ఆచరణ పెట్టాలని , పోలీస్ శాఖ అంటేనే సేవకు మొదట వుండేదని గుర్తువుంచుకోవలన్నారు, మారుతున్నకాలం నకు అనుగుణం గా వస్తున్న నూతనత్వం, సాంకేతికతను ను అనువయిస్తూ ముందుకు పోవాలన్నారు, మెరుగైన సేవలే మనలను ప్రజల వద్దకు చేర్చి మన ప్రతిష్ట ను పెంచుతాయి అన్నారు , మెరుగైన పోలీసింగ్ తో మన గౌరవం ను పతాక స్థాయి కు తీసుకుపోయేలా మన అందరం కలిసి పనిచేయాలనీ జిల్లా ఎస్పి సూచించారు, అనంతరం ఎస్పి మరియు అడిషనల్ ఎస్పి గోద్రు లు జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం మరియు మన జిల్లా సరిహద్దుల గురించి మన జిల్లా పోలిసుల పనితీరు గురించి మరియు మన వాడుతున్న సాంకేతికత గురిoచి తెలియచేశారు. ఈ కార్యక్రమము లో అడిషనల్ ఎస్పి గోద్రు, సిసి కిరణ్ కుమార్ , హెడ్ క్వార్టర్ ఆర్ ఐలు సంతోష్ కుమార్, శేఖర్ బాబు ,శ్రీనివాస్, ఏఎస్సై జాఫర్ మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి గా భక్త ప్రహ్లాద్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; కుమ్రం భీమ్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయమునకు పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేషన్ అధికారి గా భక్త ప్రహ్లాద్ నియమితులయ్యారు ఈ మేరకు ఉత్తరువుల ప్రకారం పదోన్నతి తో పాటు కుమ్రం భీమ్ జిల్లా లోనే ఆయనను తిరిగి నియమించారు, ఇంతక ముందు జిల్లా లో ఇంచార్జ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి గా విధులు నిర్వర్తించిన ఈయన , ఇక నుంచి పూర్తి స్థాయి లో కుమ్రం భీమ్ జిల్లా లోనే విధులు నిర్వర్తించనున్నారు, పదోన్నతి బాద్యత తో పాటు ఉత్సాహం ను ఇచ్చిందని ఈ ఉత్సాహం తో ముందుకు వెళ్తూ మెరుగైన పని తీరు చూపుతామని ఆయన తెలిపారు.
విద్యార్థులు క్రీడలలోకూడా రాణించాలి : సర్కిల్ ఇనస్పెక్టర్ పురుషోత్తం చారి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; విద్యతో పాటు విద్యార్థులు క్రీడలలో ముందుండా లని రెబ్బెన సర్కిల్ ఇనస్పెక్టర్ పురుషోత్తం చారి అన్నారు. బుధవారం రెబ్బెన సాయి విద్యాలయం పాఠశాల తరుపున కుంగ్ ఫు , కరాటే తెలంగాణ అంతర్ జిల్లా పోటీల్లో సింగిల్ బెల్లంపల్లి లో నిర్వహించిన సింగిల్ కటాస్ లో పాల్గొన్న వై హర్షవర్ధన్ 7త్ క్లాస్ గోల్డ్ పథకం మరియూ సాయికిరణ్ 7త్ రజత పథకం సాధించినట్టు సాయి విద్యాలయం పాఠశాల కరస్పాండెట్ డికొండ సంజీవ్ కుమార్ తెలిపారు అదేవిదంగా గ్రూప్ పోటీల్లో పాల్గొన్న ఏ శ్రవణ్ కుమార్,కె రోహిత్ కుమార్,కె మణిరాజ్,బంగారు పథకాలు సాధించారని అలాగే ఎస్ శ్రీశాంక్,పి విజయ్ కుమార్ ,జి విశాల్ రజత పథకం సాధించినట్టు తెలియజేసారు అదేవిదంగా అల్గామ్ శిరీష జిల్లా రాష్ట్ర స్థాయి కుంగ్ పోటీల్లో మూడు సార్లు బంగారు పథకాన్ని సాధించినదని తెలిపారు గెలుపొందిన విద్యార్థులను బుధవారం రోజున రెబ్బెన సీఐ పురుషోత్తంచారి అభినందించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లో కూడా విజయాలను సాధించాలని తెలిపారు.
Tuesday, 20 March 2018
యువత సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 20 ; కొమరం భీం జిల్లా: ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లాలోని నాయకులూ పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో హామీలను నెరవేరుస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో మంది ఆడపిల్లల తల్లి తండ్రులు కుల మత వివక్షలేకుండా లబ్దిపొందుతున్నారన్నారు. ఈ జిల్లాలోని నాయకులూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మృతికి సంతాపం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 20 ; పచ్చకామెర్ల వ్యాధితో మృతిచెందిన .కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణ కుటుంబీకులను పరామర్శించిన కుమ్మర సంఘము జిల్లా సలహాదారుడు ఉప్పులేటి.శంకర్ (వ్యవసాయ అధికారి తాండూరు)10000 ఆర్థిక సహాయం చేసారు, కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్ 5000 ఆర్థిక సహాయం చేసారు. జిల్లా కుమ్మర సంఘము కార్యవర్గం 3000 రూ ఆర్థిక సహాయం చేసారు.మొత్తం 18000 రూ కొండపల్లి సత్యనారాయణ భార్యకు అందజేశారు . ప్రభుత్వం నుండి వితంతు పింఛన్. ఆర్ధిక సహాయం చేయాలని కుమ్మర సంఘము జిల్లా అధ్యక్షులు కుమ్మరి.మల్లేష్ విజ్ఞప్తి చేసారు. . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం సభ్యులు. శంకర్, శ్రీనివాస్,తిరుపతి. కుమార్.శ్రీనివాస్.సత్తయ్య, మొండి.మల్లేష్. సంతోష్, సురేష్,పాల్గొన్నారు.
Monday, 19 March 2018
షాదిముబారక్, కల్యాణలక్మి పథకం సాయం పెంపు
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 19 ; ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ఔదార్యతను చాటుకున్నారని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తెరాస మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమూద్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో ఇస్తున్న 75,000 రూపాయలను 1,00,116 కు పెంచడంజరిగిందని ఈ పథకంవల్ల పేదింటి ఆడపిల్లలకు చాల మేలు జరుగుతున్నదని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా కుల,మత వివక్షలేకుండా ప్రతి పేదింటి ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ఈ పథకాలవల్ల మేలు జరుగుతుందన్నారు.
Subscribe to:
Posts (Atom)