కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: రెబ్బెన లోని సాయి విద్యాలయం (ఎస్ వి )ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు హైదెరాబాద్ లోని బోడుప్పల్ అనాథ ఆశ్రమానికి 1030/- రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ శంకరమ్మ, స్థానిక ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులు సామాజిక సేవను అలవర్చుకొవాలని అన్నారు . అదే విదంగా క్రమశిక్షణతో ఉన్నత చదువులో రాణించి సమాజంలో పేరు తెచ్చుకోవాలని తెలిపారు. సాయి విద్యాలయం విద్యార్థులు ఆట పాటలే కాకుండా అన్ని రంగాలలో ముందున్నారని , చాలా సంతోషకరమని పేర్కొన్నారు . ఈ కార్య క్రమము లో ఎపిఓ కల్పనా, ఎఇఓ అర్చన , టిఎ జయ , వార్డ్ మెంబర్లు , ఉబేదుల్లా , ఉపాధ్యాయులు విజయ లక్ష్మి, విద్యాసాగర్ , లీల , ఉదయ , సుజాత , రాజ్కుమార్ , మంగమ్మ , రేష్మ లతో పాటు పాఠశాల కరెస్పాండెట్ ఢీకొండ సంజీవ్ కుమార్ లు ఉన్నారు.
No comments:
Post a Comment