Thursday, 17 March 2016

ఫ్లై ఓవర్ లేక స్థానికుల కష్టాలు మరియు ప్రయాణీకుల ఇబందులు

 ఫ్లై ఓవర్ లేక స్థానికుల కష్టాలు మరియు ప్రయాణీకుల ఇబందులు  
   రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో గల అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ (రెబ్బెన) నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ లో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లేక స్టేషన్ వెనకాల ఉన్న కాలనివాసులు ( దాదాపు 200 మంది ) మరియు ప్రతి రోజు  ఈ స్టేషన్




నుండి రాకపోకలు జరుపే  ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .  అదే విధంగా అసిఫాబాద్ నియోజక వర్గానికి గల ఎకైక రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నుండి రోజుకు దాదాపు 500ల మంది ప్రయాణికులు అసిఫాబాద్ ;వాంకిడి; కేరమెరి, జైనూరు ,రెబ్బెన మండలాల మరియు గోలేటి ; నంబాల ; గంగాపూర్ ;జక్కులపల్లి ;కొమురవెళ్ళి ; నార్లాపూర్  ; పున్జుమేరగూడ ;సింగల్ గూడ ; కొడపల్లి ; వాంకిడి ; కెరమెరి  గ్రామాల ప్రజలు ఈ  స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు . నిజాం కాలం నాటి ఈ  రైల్వే స్టేషన్ దాదాపు 50 సం,, రాల  అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఈప్పటికీ ఎ  అబివృద్దికి నోచుకోలేదు మురుగుదోడ్లు;మూత్రశాలలు;విశ్రాంతి గదులు;త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని  ప్రయాణికులు కోరుతున్నారు. ఈప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు  అధికారులు మారినా

స్టేషన్  పరిసరాలు  మారని వైనం . ఈ స్టేషన్ నుండి ప్రతి రోజు కాజీపేట నుండి బలార్ష వైపు 3 ట్రైన్స్ మరియు  సికింద్రాబాద్ నుండి సిర్పూర్-కాగజ్ నగర్  వైపు 2 ట్రైన్స్ వెల్తునాయ్ . వ్ర్రుద్దులు  ; మహిళలు ; పిల్లలు;వికలాంగులు ఫ్లాట్ ఫాం 1 నుండి ఫ్లాట్ ఫాం 2 వైపు వెళ్ళడానికి ఈబ్బందీగా వుంది . అపుడప్పుడు గూడ్స్ రైలు మధ్యలో ఆగివున్న గూడ్స్ రైలు కిందనుండి దాటి 2వ ఫ్లాట్ ఫాంకు వెళ్ళడానికి ఈబ్బందిగా వుందని విద్యార్థి ఆరిఫ్ అలీ మరియు ప్రయాణికులు వాపోయారు .   అదే విధంగా తెలంగాణ ముద్దు నల్ల బంగారం  బొగ్గు గని (గోలేటి ; కైరిగూడ గని)లో వేలాది మంది కార్మికులు;గని ఉన్నతాదికారులు ఉద్యోగ అవసరాలకు ఈ రైలు మార్గానే ఉపయోగిస్తారు. అదే విధంగా ఈ రైల్వే స్టేషన్లో మరి కొన్ని రైళ్ళు ( తెలంగాణ ;ఏపి;జెనతా)ఆపాలని గని కార్మికులు; ప్రయాణికులు మరియు స్తానికులైన  గొగ్గర్ల ప్రవీణ్ కూమార్; రమేష్; జి.హరి క్రిష్ణ; క్రాంతి; బైరి.రాజ్ కుమార్ గౌడ్, ముడేడ్ల శ్రీనివాస్  యువజన గౌడ సంగం జిల్లా కోశాదికారి  కొయ్యడ రాజ గౌడ్; తెరాస మండల మైనారిటి అద్యక్షుల్లు అన్వర్ భాయ్ లు కోరారు.

No comments:

Post a Comment