తెలంగాణ ఉద్యమ కారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా బోగే ఉపేందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ ఉద్యమ కారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందినా బోగే ఉపేందర్ ను నియమించినట్లు అ సంఘం జిల్లా అధ్యక్షుడు వహాబ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బముగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉద్యమ కారుల పాత్ర మరువ లేనిది అని అన్నారు అలాగే 2009 సం లో అప్పటి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచి వేసేందుకు అక్రమ కేసులు పెట్టిందని దాని వలన ఉద్యమ కారుల ఆర్దికముగా మానసికముగా ఉద్యోగ అవకాశాలు రాక తీవ్రముగా నష్ట పోయారని, ఇప్పటికి అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర యోదులుగా గుర్తిచాలని, అలాగే ఉద్యోగం ఇవ్వాలని, పెన్షన్ లు ఇవ్వాలని, అర్హులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మరియు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తా అని అన్నారు
No comments:
Post a Comment