రెబ్బెన ; భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పీ ఆరె టి యూ రాష్ట్ర కార్యదర్శి దొడ్డిపట్ల రవికుమార్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గురువారం రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో 144 వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలో దొడ్డిపట్ల రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్ మాట్లాడతు జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమం లొ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోషం మల్లునాయుడు దేవరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 31 October 2019
వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
రెబ్బెన ; భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని పీ ఆరె టి యూ రాష్ట్ర కార్యదర్శి దొడ్డిపట్ల రవికుమార్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గురువారం రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో 144 వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలో దొడ్డిపట్ల రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్ మాట్లాడతు జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమం లొ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పోషం మల్లునాయుడు దేవరకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ తోనే హక్కులు సాధ్యం : బోగే ఉపేందర్
రెబ్బెన : కార్మిక హక్కులు ఎర్ర జెండా ఏఐటీయూసీ తోనే సాధ్యమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు,ఏఐటీయూసీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెబ్బన మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు రమేష్ ఆవిష్కరించారు అనంతపురం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత కార్మిక వర్గంలో ఉన్న వారందరికీ కనీస వేతనం 18000 ఇవ్వాలని డిమాండ్, అలాగే కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ ఈ.ఎస్.ఐ,పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వెంకటేష్, మార్కెట్ హమాలీ సంఘం మండల అధ్యక్షుడు అరికిల్ల వెంకటేష్, కార్యదర్శి స్వామి,నాయకులు శంకర్,వసంత్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి
రెబ్బెన : వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపిపి జుమ్ముడి సౌందర్య ఆనంద్, zptc వేముర్ల సంతోష్ లు అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 144వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ సీనియర్ స్టెంట్ వేణు , కాప్షన్ సభ్యులు జహురుద్దిన్ ఏపీవో కల్పనా, మదునయ్య, రవీందర్, ఆనంద్, ఫాదర్లు పాల్గొన్నారు
Subscribe to:
Posts (Atom)