Wednesday, 14 November 2018

సత్ప్రవర్తనే గొప్ప లక్ష్యాల సాధనకు పునాది

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 14 : విద్యార్థుల సత్ప్రవర్తనే గొప్ప లక్ష్యాల సాధనకు   పునాది   అని  రెబ్బెన మండలం  ఎస్ ఐ  దీకొండ రమేష్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో  జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని  పులికుంట, నంబాల, గంగాపూర్, పాసిగామ, రెబ్బెన  ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో నెహ్రు జయంతిని జరుపు కున్నారు. నక్కలగూడా పాఠశాలలో జరిగిన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   ఎస్ ఐ  దీకొండ రమేష్ పాల్గొని నెహ్రూ పటానికి పూలమాలలు వేసి అలంకరించారు.  అనంతరం  మాట్లాడుతూ చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరని  చెప్పారు చదువుతోపాటు పెద్దల పట్ల వినయంగా ఉండడం కూడా నేర్చుకోవాలని చెప్పారు.  తాను కూడా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ పాఠశాలలోనే  చదివాను అని చెప్పారు  విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేసి స్వీట్లు పంచారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కల్వల   శంకర్  మాట్లాడుతూ  బాలలందరూ  శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా రూపొందాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు తదనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్,  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రవి,  యస్.అనిల్ కుమార్, శైలజ, కవిత, గ్రామస్తులు మీసాల  పోష మల్లు.  రావుజి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment