Monday, 4 December 2017

డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 4 :  బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో సోమవారం  గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నందు దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగిందని  ఏరియా డీజీఎం పర్సనల్  జె  కిరణ్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఓ జీఎం కె కొండయ్య మాట్లాడుతూ దివ్యాంగులను అందరితో కలిసి సమానంగా చూడాలని ఎవరినీ కించపరుస్తూ మాట్లాడారాదని కోరారు.  దివ్యాంగులలో  కొంతమంది మూగ, గుడ్డి, సరిగ్గా నడవలేని వారు అంగ వైకల్యంతో ఉంటారని వీరిని కంటికి రెప్పలా కాపాడుకునే వారి తల్లిదండ్రులను ధన్యవాదాలు తెలిపారు. అంగ  వైకల్యం ఉందని బాధపడొద్దని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం కూడా చేయూత అందిస్తుందని అంగవైకల్యాన్ని జయించి ప్రపంచంలో కొంతమంది శాస్త్రజ్ఞులుగా కూడా ఎదిగారని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు ముఖ్యంగా టీఆర్ ఎస్పీ కమ్యూన్ మ్యూజిక్ సంస్థ ద్వారా దివ్యాంగులకు పాటల పాటలు కీబోర్డ్స్ ఫ్యాక్స్ లతో చక్కని ప్రదర్శన ఇచ్చిన రని అనంతరం ఎస్సో టూ జిఎం కొండయ్య  అందరికీ మెమొంటోలు అందజేశారు.  మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులందరికీ చక్కని ఆహార పొట్లాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీవై పీఎం ఏ రాజేశ్వర్, సింగరేణి స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు, పిఇటి భాస్కర్, అసిస్టెంట్ స్టోర్ సూపర్వైజర్  హెచ్ రమేష్, కాంటినెంట్ డి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment