Sunday, 10 December 2017

శ్వశాన వాటిక ఏర్పాటుకు అధికారుల నిర్లక్ష్యం : ఖాండ్రే విశాల్

శ్వశాన వాటిక ఏర్పాటుకు అధికారుల నిర్లక్ష్యం : ఖాండ్రే  విశాల్ 
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 10 :  కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో శ్వశాన వాటిక ఏర్పాటుకు గ్రహణం పట్టిందని హిందూ సాధన సమితి అధ్యక్షులు ఖాండ్రే   విశాల్ అన్నారు. ఆసిఫాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్మశాన వాటిక కోసం రిలే నిరాహారదీక్షలు చేయడం తో అధికారులు, రాజకీయ నేతలు త్వరలోనే భూమిని కేటాయించి శ్మశానవాటిక నిర్మిస్తామని హామీ ఇచ్చి  రిలే నిరాహార దీక్షలను విరమింపచేశారన్నారు. సుమారు రెండేళ్లు  కావస్తున్నా ఇంతవరకు ఈ విషయంలో  ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి చంపాలాల్ ను సంప్రదించగా సంబంధిత అధికారులకు సిఫారసు పంపగా కింది స్థాయి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సత్వరమే స్పందించి స్మశానవాటికను త్వరలో మంజూరు చేయకపోతే  మళ్లి  ఆందోళన బాట పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, మొండయ్య, శ్యామ్, శ్రీనివాస్, ఉపేందర్, ఈశ్వర్, రాజయ్య, సత్యనారాయణ, హరీష్, రాజ్ కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment