Tuesday, 8 August 2017

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పాలనాధికారి కార్యాలయం ముట్టడి

 
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పాలనాధికారి కార్యాలయం ముట్టడి

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 08 ;    విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు(బుధవారం) కుమురం భీమ్ జిల్లా పాలనాధికారి కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడిస్తున్నామని మండల కన్వీనర్ జుమ్మిడి  అరుణ్ కుమార్ తెలిపారు. రెబ్బెన  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రoలో 400 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో నాయకులు,విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.ఈ సమావేశంలో నవీన్,రాహుల్,రాజేష్ లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment