Wednesday, 19 April 2017

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తాం;కలెక్టర్ చంపాలాల్

                        ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తాం;కలెక్టర్ చంపాలాల్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  19 ;   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తామని కొమురం భీం జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్నీ సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. అతర్రాష్ట్ర రహదారికి సమీపంలో  ఉన్న ఆరోగ్య కేంద్రానికి మరింత మెరుగైన సేవలందించడానికి ప్రత్యేక  నిదుల నుండి పది లక్షల రూపాయలను కేటాయించి రెండు అదనపు గదులను నిర్మించి ఒకటి మహిళల వార్డ్ మరియు పురుషుల వార్డ్ లను నిర్మించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఒకటే వార్డ్ ఉంది అందులో ఆరు పడకలు  ఉండటం వాళ్ళ రోగులకు సరిపోవడం లేదని అయన అన్నారు. ఆరోగ్య కేంద్రం లో పని చేస్తున్న యొక్క హాజరు పట్టికను పరిశీలించి   అందుబాటులో ఉన్న ముందులను పరిశీలించారు. ఆయనతో పటు డి ఆర్ డి ఓ శంకర్, డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు, డి వై డి ఎం హెచ్ ఓ సీతారాం, ఎం ఆర్ ఓ రమేష్ గౌడ్, ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, ఎపిఓ కల్పనా, సర్పంచ్ వెంకటమ్మ, కో అప్షన్ సబ్బుడు జాకీర్ హుస్మని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గరలో గల ఇజిఎస్ నర్సరీని పరిశీలించి మొక్కలను సకలం లో నాటేలా మొక్కల్ని పెంచాలన్నారు. అదే విదంగా రెబ్బెన గ్రామ పంచాయితీని సందర్శించి స్వచ్ భరత్ పరిశుభ్రతలో మంజూరు ఆయన మరుగు దొడ్లు తాలూకా చెక్ కులను పంపిణి చేశారు.

No comments:

Post a Comment