సస్పెండ్ అయిన డ్రైవర్ ను విధుల్లోకి తీసుకోవాలి
తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 10 ; కక్షపూరితంగా మంచిర్యాల ఆర్టీసీ డిపో కు చెందిన బస్సు డ్రైవర్ ఎం.దుర్గయ్యను సస్పెండ్ చేయడం అన్యాయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు.రెబ్బెనలో శుక్రవారం రోజున రోడ్లు మరియు భవనలు విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతు జనవరి నెల 20వ తేదీన రెబ్బెన సమీపంలోని పుంజుమేరగూడెం వద్ద అనుకోని రీతిలో బస్సు మరియు ఆటో ప్రమాదం జరగడం బాధకరం అని అన్నారు.ఆటోలో పది మంది ప్రయాణికులు ఉండగా బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వలనే పెనుప్రమాదం తప్పిందని అన్నారు.దీనికి డ్రైవర్ దుర్గయ్యను అభినదించాల్సింది పోయి,విధుల్లో నుండి సస్పెండ్ చేయడం అన్యాయమని,మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరి,నిర్ణయం సరికాదని విమర్శించారు.పోలీస్ స్టేషన్ లో కూడా డ్రైవర్ పై ఐపీసీ 337 చట్టం క్రింద కేసు నమోదు అయినది అని, ఆ చట్టంలో డ్రైవర్ సస్పెండ్ అంశం లేదని,అయినా డిపో మేనేజర్ చట్ట విరుద్ధానికి పాల్పడ్డారని విమర్శించారు.నెల రోజులు గ డ్రైవర్ ను సస్పెండ్ చేయడం వల్ల మానసిక ఆందోళన చెందుతున్నాడని అన్నారు.డ్రైవర్ సస్పెండను నిరసిస్తూ గత 20 రోజులుగా ఎంప్లాయిస్ యూనియన్ నిరాహార ద్దీక్షలు చేపట్టిన స్పందించక పోవడం మంచిపద్ధతి కాదని అన్నారు.యాజమాన్యం స్పందించి డ్రైవర్ దుర్గయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసారు,లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళను చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జక్కుల మల్లేష్ గౌడ్,జి.ఎస్ నారాయణ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కలవేణి శంకర్,రీజినల్ అధ్యక్షులు కె.భీంరెడ్డి,ఆసిఫాబాద్,మంచిర్యాల డివిజన్ అధ్యక్షులు ఏ.మురళి,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,కోశాధికారి రాయిల్ల నర్సయ్యలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment