ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్న విజయకు ఆర్ధిక సహాయం
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ; రెబ్బన మండలం లోని గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ వారు కాలేయ సమస్యతో బాధపడుతున్న పి విజయకు రెండు వేళా రూపాయిలు ఆర్ధిక సహాయం చేసినట్లు బుధవారం తెలిపారు ఈ సందర్బంగా గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్మీర వస్త్రం నాయక్ మాట్లాడుతూ పి విజయ గత సవంత్సరం రెబ్బన కళాశాలలో స్లీపరుగా పనిచేస్తుండేది కొన్ని రోజుల నుండి కాలేయ వ్యాధి తో ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుందని, నీరు పేదలు కావటం వలన స్థోమత లేక చికిత్స కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులు రాజు కుమార్, మహేందర్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
Good job ....
ReplyDelete