విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలి ; జిఎం రవి శంకర్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; విద్యార్థులు శ్రద్దగా చదువు కొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిఎం రవి శంకర్ అన్నారు. రెబ్బెన మండలం లోని హోలీటి సింగరేణి హై స్కూల్ 34వ వార్షికోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల భవిషత్ తో పాటు పిల్లల చదువుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి చదువు కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు చదువు తో పాటు వివిధ క్రీడా రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు అలాగే ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని యోగ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య ప్రధానమైనదని విద్యతోటె అన్ని రంగాల్లో రాణించవచ్చు నాని, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకొని విద్యను శ్రద్ధగా చదివినట్లయితే భవిష్తలో ఉన్నత శ్రేణిలకు చేరొచ్చునని అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ఆట పాటలతో వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసి పలుగుర్ని ఆకట్టు కున్నారు. ఈ కార్యక్రం లో డా ,సంతోష్ సింగ్ , జీఎం ఎడ్యుకేషన్ రామ్ నారాయణ, జిఎఫ్ అండ్ ఏ కృష్ణమోహన్, డిజీఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్, సేవ అధ్యక్షురాలు అనురాధ ,హెచ్ ఎం వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి, టిబిజికెఎస్ నాయకులూ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment