Thursday, 12 January 2017

వివేకానంద ఆశయలను కొనసాగించాలి ; భాజపా జిల్లా అధ్యక్షుడు జె.బి పౌడెల్

   వివేకానంద ఆశయలను కొనసాగించాలి ;

భాజపా జిల్లా అధ్యక్షుడు జె.బి పౌడెల్ 


కుమురం బీమ్ ఆసిఫాబాద్  ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ; యువత వివేకానంద అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు జె.బి పౌడెల్ అన్నారు.గురువారం కుమురం బీమ్ బి.జె.పి  జిల్లా కార్యాలయంలో రెబ్బెన మండలం లోని  గోలేటిలో   వివేకానంద 154వ జయంతిని ఘనంగా నిర్వహిచారు.ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతు స్వామి వివేకానంద భారత దేశానికి చేసిన సేవలు మరువలేనియని అన్నారు.దేశంలో యువత అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు.శక్తి యుక్తులు ఉన్న యువత దేశంలో ఎక్కువగా ఉన్నారని అన్నారు. యువత శాంతయుతంగా సన్మార్గంలో నడుస్తూ వివేకానంద ఆశయాలను,లక్ష్యాలను నరవేర్చాలని అన్నారు.అలాగే ఆసిఫాబాద్ మండల కేంద్రంలో కూడా భాజపా మండల అధ్యక్షులు కాండ్రే విశాల్ వివేకానంద జయంతి సందర్బంగా పేద ప్రజలకు వస్త్రాలను పంపిణి చేశారు.ఈ కార్యక్రమాలల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్,ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారి,ఎంపీటీసీ సభ్యులు సురేందర్ రాజు,అసెంబ్లీ కన్వినర్ గుల్భము చక్రపాణి,మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ,మండల కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సునీల్ చౌదరి,నాయకులు ఈదులవాడ మారుతి,గుండా శంకర్,లక్ష్మణ్,జుమ్మిడి రాజేష్, బంతిని రాము,ఇగురపు సంజీవ్,  ఎం.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment