గంగాపూర్ దేవాలయాన్ని అభివృద్ధి పర్చండి
గంగాపూర్ దేవాలయ జాతర పైల్ ఫోటో
కొమరంభీం ఆసిఫాబాద్ ( వుదయం ప్రతినిధి) జనవరి 09 రెబ్బెన; రెబ్బెన మండల కేద్రములోని గంగాపూర్ సమీపములో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి పర్చాలని గంగాపూర్ ప్రజలు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగములో అందజేసి నాట్లు బి జె వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురాపు సంజీవ్ తెలిపారు . బాలాజీ వెంకటేశ్వర ఆలయాన్ని జిల్లాలో ఓ ప్రత్యకత ఉందని , గత జాతర సాందర్బంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి దర్శనం చేసుకొన్నారని , దేవాలయ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తానని హామీ ఇచ్చ్చారని ఆయన పేర్కొన్నారు . జిల్లా కలెక్టర్ గా మీరు చొరవ తీసుకొని దేవాలయ ప్రాంతానికి 20 ఎకరాల భూమి కేటాయించి , అభివృద్ధి పరచాలని మండల వాసులు కోరుతున్నారు.
No comments:
Post a Comment