యాసంగి పంటలకు మెళుకువలు పాటించాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) యాసంగి వరి పంట సాగులలో మంచి విత్తనాలను ఎంచుకొని విత్తన శుద్ధి చేసి మెళకువలు పాటిస్తే పంట దిగుబడులు వస్తాయి అని జిల్లా వ్యవసాయ అధికారి అలీమ్ అహ్మద్ అన్నారు రెబ్బెన మండలంలో రైతు అవగాహనా సదస్సులో అయన మాట్లాడుతూ ఈ వేసవి సాగులో అకాల వడగళ్ల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే విత్తన కొనుగోలు కేంద్రాలలో మంచి నాణ్యత విత్తనాలను పరిశీలించి తీసుకోవాలి అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తుంది ఆ విత్తనాలను కొనుగోలు చేస్తే అధిక దిగుబడి వస్తది అని అన్నారు అలాగే రైతులు రసాయానిక ఎరువుల లకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడితే అధిక ఉత్పత్తి దోహద పడుతుంది అని రైతులకు అవగాహనా కల్పించారు ఈ సమావేశంలో ఏ డి శ్రీనివాస్, డి టి ఎం గురుమూర్తి ,మండల వ్యవసాయ అధికారి మంజుల ,వ్యవసాయ సహాయక అధికారి మార్క్ ,కిష్టాపూర్ సర్పంచ్ భీమేష్ ,మరియు రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment