Wednesday, 6 July 2016

హరిత హారంలో అందరూ పలు పంచుకోవాలి -జెడ్ పి టి సి అజ్మీర బాబురావు

హరిత హారంలో అందరూ పలు పంచుకోవాలి

-జెడ్ పి టి సి అజ్మీర బాబురావు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన హరిత హారం కార్యక్రమం ఈ నెల 8 నుంచి 23 వరకు జరగబోయే హరితహారం కార్యక్రమంలో అధికారులు,స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు  అందరూ పలు పంచుకోవాలి అని,ముఖ్య అతిధిగా జెడ్ పి టి సి అజ్మీర బాబురావు  అన్నారు.  రెబ్బెన మండలం స్థానిక ఎమ్ పి డి ఓ కార్యాలయం  హరిత హారం కార్యక్రమం లో   జెడ్ పి టి సి అజ్మీర బాబురావు,  రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్,ఎమ్ పి డి ఓ లక్ష్మినారాయణ మాట్లాడారు    చెరువుల గట్ల మీద ఈత చెట్లను నాటాలి రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటాలి శాఖం భూములలో దేవాలయాలలో, పాఠశాలలో , మసీద్ లలో,  చర్చిలలో, ఇంటి చుట్టుపక్కలలో నీడని ఇచ్చే చెట్లు పూల మొక్కలు , పళ్ల మొక్కలు ,నాటాలి అన్నారు ఈ యొక్క చెట్లు నాటే  బాధ్యత గ్రామ సర్పంచ్,ఎమ్ పి టి సి లు ,వార్డు మెంబర్లు ,అంగన్ వాడి కార్యకర్తలు ,విద్యార్థులు , ఈ జి ఎస్ ప్రజల పైన ఉంది అని అన్నారు . ప్రతి గ్రామా పంచాయితీ  కి 40,000 మొక్కలు నాటి వాటికి పోషణ చేపట్టి నట్లయితే లక్ష రూపాయల బహుమతి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  ఏ  పి ఓ కల్పన, ఆ పి ఎమ్ రాజకుమార్, ఎమ్ ఈ ఓ వెంకటస్వామి, అంగన్ వాడి కార్యకర్తలు, సర్పంచ్ లు  పాల్గొన్నారు 
మ్యారేజ్ బ్యూరో

No comments:

Post a Comment