రెబ్బెన : మండలంలోని చింగిలి గూడ గ్రామానికి చెందిన లావుడ్యా దాస్మబాయి (65) గురువారం విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు తన పొలం లో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్థంబాలకున్న వైర్లు కిందికి వేలాడుతుండడంతో అవి ఆమె తలకు తగలడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా... విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నట్లు అధికారులకు ఎన్నోమార్లు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత వారం రోజుల క్రితం రెబ్బన్‌లోని ఇందిరా కాలనీ ఇళ్లపైనుంచి వెళుతున్న 11 కేవీ విద్యుత్ తీగెలు తెగి ఇళ్లమీదపడి మంటలు చెలరేగిన విషయం మరవకముందే మళ్లీ... ఈ సంఘటన జరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాం టి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 4 July 2015
విద్యుత్ వైర్లు తగిలి మహిళ మృతి
రెబ్బెన : మండలంలోని చింగిలి గూడ గ్రామానికి చెందిన లావుడ్యా దాస్మబాయి (65) గురువారం విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు తన పొలం లో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్థంబాలకున్న వైర్లు కిందికి వేలాడుతుండడంతో అవి ఆమె తలకు తగలడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా... విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నట్లు అధికారులకు ఎన్నోమార్లు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత వారం రోజుల క్రితం రెబ్బన్‌లోని ఇందిరా కాలనీ ఇళ్లపైనుంచి వెళుతున్న 11 కేవీ విద్యుత్ తీగెలు తెగి ఇళ్లమీదపడి మంటలు చెలరేగిన విషయం మరవకముందే మళ్లీ... ఈ సంఘటన జరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాం టి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment