Saturday, 8 January 2022

పేదలకు సేవ చేయడం ఎంతో గర్వకారణం

 రెబ్బెన :      పేదలకు సెవ చేయడం ఎంతో ఉన్నతమైనదాని, సర్పంచి అహల్యాదేవి, రెబ్బెన సి ఐ సతీష్ కుమార్, ఎస్సై పి భవాని సేన్ లు అన్నారు.  రెబ్బెన లో సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో పేద వారికి దుస్తులను , చీరలను శనివారం పంపిణీ  చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కూడా డా ఎన్నో రకాల వివిధ సేవా కార్యక్రమాలను సంస్థ ద్వారా చేయడం జరిగింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛత  పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా కరోనా  సమయంలో  సన్మానించడం  జరిగిందని,  అదేవిధంగా సంజీవని స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో  అధ్యక్షుడు దీకొండ సంజీవ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, మగవారికి  డ్రెస్సులు పంపిణీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భవిషతులో  ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని,  దానికోసం మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం పి టి సి సభ్యులు పెసర మద్దయ్య,సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ దీ కొండ సాయి తేజ,  సంజీవనిస్వచ్చంద అధ్యక్షుడు సంజీవ్ కుమార్,  సంజీవని స్వచ్ఛంద   రాజశేఖర్ ,తిరుపతి,  మహేందర్,  విజయ కుమారి శీభా , బొడ్డుప్రసాద్ లతోపాటు విద్యార్థులు ఉన్నారూ.

Sunday, 2 January 2022

అధికారుల ప్రోత్సహముతో అభివృద్ధి దిశలో--పి ఓ శ్రీనివాస్

  రెబ్బెన :   సింగరేణిలో రాత్రిమ్బావాళ్ళు పని చేస్తూ అభివృద్ధి దిశలో వెళ్తున్నామంటే దానికి కారణం జి ఎం సంజీవ రెడ్డి తో పాటు పై అధికారుల ప్రోత్సహమేనని ఖైరిగుడా ప్రాజెక్టు అధికారి ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతములో ప్రజానీకానికి ఉద్యోగ కల్ప తల్లిగా మారి ఎందరికో సింగరేణి తెలంగాణ తల్లిగా వెలసిల్లింది అని తెలిపారు . కార్మికులు , సుపెరువైజర్లు అధికారులు కలిసి కట్టుగా పనిచేస్తే కంపెనీ యాజమాన్యం పెట్టిన టార్గెట్ ను అధిగమించే విధంగా  అందరూ కృషి చేయాలని  అన్నారు. అదేవిధంగా  జీఎం ఆధ్వర్యంలో రక్షణ చర్యలు, కార్మిక సంక్షేమంపై దృష్టి సారిస్తూ , ఉత్పత్తిని సాధిస్తున్నామని అన్నారు. ఖైరిగుడా ఓపెన్ కాస్టులో ని కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.