కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బెన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ స్వర్ణ లత హాజరయ్యారు. ముందుగా సర్ సి వి రామన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ సర్ సి వి రామన్ గారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని తెలియజేశారు. 1928లో రామన్ ఎఫెక్ట్ అనబడే కాంతి కిరణాల గురించి పరిశోధనలో విజయం సాధించి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను ఆయనకు 1930లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ బహుమతి లభించిందన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా రెబ్బెన హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీదేవి, ఆంగ్ల ఉపాధ్యాయులు అనీస్ అహ్మద్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 28 February 2019
సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర మహాసభలను విజయవంతం చేయలి ; బోగే ఉపేందర్
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; సింగరేణి కాంట్రాక్టు కార్మికుల కేంద్ర 2వ మహాసభలు కొత్తగూడెంలోని మార్చి 3వ తేదీ రుద్రంపూర్ లో జరుగుతాయని ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని scwu గోలేటి బ్రాంచి అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు.గురువారం రోజున గోలేటి లోని కె ఎల్ మహేంద్ర భవన్ కార్మికుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకుంటూ,సంస్థ లాభలోకి రావడానికి,అభివృద్ధి చెందడానికి కార్మికుల కీలక పాత్ర పోసిస్తున్నారని,అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు,01.01.2013 నుంచి హై పవర్ కమిటీ వేతనాలు చెలించాలని ఉన్నా యాజమాన్యం చెలించడం లేదని,కోల్ ఇండియా లో చేసిన ఒప్పందాలను అమలు చేయాలని అన్నారు,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు,కార్మికులకు లాభాల వాటా చెలించాలని, కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మార్చదని డిమాండ్ చేశారు,కార్మికుల CMPF వివరాలు తప్పుల ఉన్నాయని,అ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం చేయడంలో విఫలం అయ్యారని అన్నారు,అలాగే కార్మికుల కుటుంబాలకు వైద్య సదుపాయం కల్పించాలనిఅన్నారు,ప్రతి నెల 10 తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని,అలాగే కార్మికులకు జీతం చిట్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,సి.హెచ్.పి ,బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు స్కిల్ల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలను కేంద్ర మహాసభ లో చర్చించి తీర్మానాలు చేయడం జరిగుతున్నదని అన్నారు. కావున ఏరియా లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లురి అశోక్,సహాయ కార్యదర్శి సాగర్,నాయకులు ఆశలు,తిరుపతి, శంకర్,నాగేశ్వర్ రావులతో పాటు తదితరులు ఉన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవా వేడుకలు
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రెబ్బెన మండలం నారాయణపూర్ ప్రాథమికొన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి అమృత హాజరయ్యారు. విద్యార్థులు తాయారు చేసిన ప్రయోగాలని,బోదనోపకరణాలని తిలికించారు ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననటి నుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పల్లె శ్రీనివాస్ ,సుగుణకార్,కిరణ్ ,జగదీశ్, తిరుపతి,పాఠశాల ఉపాధ్యాయులు శారద, కవిత రాణి, సరోజ, సిఆర్పీ యం.రాజేష్, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Wednesday, 27 February 2019
పిచ్చికుక్కల స్వైరవిహారం ; పలువురికి తీవ్ర గాయలు
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్దిరోజులుగా పిచ్చికుక్కలు గ్రామంలో విచ్చల విడిగా తిరిగితున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. . బుధ వారం గంగాపూర్ గ్రామంలో వాడే లక్ష్మి 4 సం పాపను, లక్ష్మీపూర్ గ్రామంలో మరొకరిని పెప్రి వెంకటేష్ 5 సం బాబు , పాసిగం గ్రామంలో దాగం మల్లయ్య 60 సం, తాళ్లపల్లి జ్యోతి 35 సంవత్సరాలు ఇద్దరి ని గాయపరచడంతో పాటు మూడు మేకలపై దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి పిచ్చికుక్కలను అరికట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో చిన్నపిల్లలు గాని వృద్దులు గాని ఆయా గ్రామాలలో ఇండ్లనుండి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.
స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి
చంద్రశేఖర్ ఆజాద్ కు ఘన నివాళి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 27 ; ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ స్వతంత్రం కోసం పోరాడిన మన నాయకులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత రంగంలో స్థిరపడాలనే తెలియజేశారు 25 సంవత్సరాల చిరు ప్రాయంలోనే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడుతూ తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని అన్నారు . 1919 లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం చంద్రశేఖర్ ఆజాద్ మనసును బాగా కలచివేయడంతో 19 28 సెప్టెంబర్ లో భగత్ సింగ్ సుఖదేవ్ లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారన్నారు. భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం తీసుకురావాలనేది చంద్రశేఖర్ ఆజాద్ దృఢ సంకల్పం స్వాతంత్ర ఉద్యమ కారులను అణగదొక్కే బ్రిటిష్ అధికారుల పై చంద్రశేఖర్ ఆజాద్ తన సహచరులతో కలిసి దాడి చేసేవారన్నారు. ఫిబ్రవరి 27 1931వ సంవత్సరంలో బ్రిటిష్ వారు బందీగా పట్టుకోవడంతో బ్రిటీష్ అధికారుల చేతుల్లో చావకూడదు అన్న ఆలోచనతో తనను తాను కాల్చుకుని మరణించాడన్నారు. ఈ కార్యక్రమానికి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి , చైతన్య, దుర్గం శ్రీనివాస్, లకావత్ శంకర్, దురిశెట్టిరాజశేఖర్, కుమార్, నాగరాజు మరియు వార్డు మెంబర్ శ్యామ్ రావు విద్యా కమిటీ చైర్మన్ మీసాల పోష మల్లు ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
Saturday, 23 February 2019
కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్

ఓటర్లు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొవాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఓటర్లు ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్ ఊర్మిళ అన్నారు. శనివారం రెబ్బెన మండలం వం కులం గ్రామం పోలింగ్ స్టేషన్ 269 లో ప్రజలకు ఎన్నికలలో ఉపయోగించే ఈవిఎం , వి వి ఫాట్ యంత్రాల వినియోగ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం పదోన్నతులు వేతన స్థిరీకరణ చేపట్టాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఉమ్మడి సీనియారిటీ మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం పదోన్నతులు , వేతన స్థిరీకరణ చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఢిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎస్ జి టి సమావేశంలో ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి, కల్వల శంకర్ ,తదితరులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వేతన స్థిరీకరణ చేపడితే తదనంతర పర్యవసానాల కు జిల్లా విద్యాశాఖాధికారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించ వలసి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో లోకేష్, రవికుమార్, సోమశేఖర్, శ్రీను, నాగరాజు, మనోహర్, శ్రీనివాస్, జనార్దన్, శ్రీధర్, అశోక్, వినోద్, సంతోష్ లు పాల్గొన్నారు.
Thursday, 21 February 2019
సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 సమస్యలను పరిష్కరించే వారినే శాసన మండలి ఎన్నికలలో ఉపాధ్యాయ ప్రతినిధిగా గెలిపించాలని .ఎస్టీయూ జిల్లా అధ్యక్షలు తాటి రవీందర్ అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని వివిధ పాఠశాలలలో ఎస్టీయూ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా ఉఫాద్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సి పి ఎస్ అని .దానిని అంతం చేసే వరకు శాసన మండలిలో పోరాడుతామని, శాసన మండలిలో ప్రశ్నిచే వారు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడుతాయని, ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఎస్టీయూ ముందుంటుందని, గతంలో ధర్మగ్రహాసభ,పొరుదీక్ష,మహాధర్నా,లాంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఒత్తిడిలకు లొంగకుండా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులు ఆలోచించి ఎస్ టి యు అభ్యర్థి ని గెలిపించ వల్సిందిగా కో రారు. ఈప్రచారంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క మానిక్ రావు,రెబ్బెన మండలాధ్యక్షులు చునార్కర్ తుకారామ్ రెబ్బెన మండల .ఎస్టీయూ కార్యదర్శి వసీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొవాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 ; విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమం అనంతరం ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఒక నిముషం మౌనంపాటించి నివాళులర్పించారు. అనంతరం కాళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకొంటున్నప్పుడే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన దిశగా అడుగు వేసి సాధిస్తే జీవితం సుఖమయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. పరీక్షలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు మెమెంటో లు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపాల్ అతియా ఖానం, లెక్చరర్ శాంత, రెబ్బెన కళాశాల అధ్యాపకులు ప్రకాష్, గంగాధర్, సతీష్, శ్రీనివాస్, అమరేందర్, ప్రవీణ్, మంజుల, వెంకటేశ్వర, మల్లేశ్వరి, వరలక్ష్మి, దీప్తి, నిర్మ్యాల, సంధ్య, ఝాన్సీ, మహేష్, కృష్ణ మూర్తి, సరళ, సిబ్బంది ప్రకాష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Monday, 18 February 2019
కన్నులపండుగా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం
స్వామి వారి కల్యాణం ; ప్రారంభమైన గంగాపూర్ జాతర
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 18 ; రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం సోమవారం కన్నులపండుగగా కడురమణీయంగా వైభవంగా వేదమంత్రాల నడుమ వెలది భక్తుల మద్య జరిగింది. భక్తులు స్వామి వారి మండపంలో వేదపండితులచే వేదమంత్రోచ్చారణలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రెబ్బెనమండలంలోని వివిధ గ్రామాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు. కళ్యాణం అనంతరంకొందరుభక్తులుఅన్నదానకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భక్తులకు భద్రతా, త్రాగునీటి సదుపాయం, కల్పించారు. ఈ కార్యక్రమంలో వ లంటీర్లు సేవలు అందించారు. రేపు జరిగే రధోత్సవమునకు వే లాది భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు తెలిపారు.
Sunday, 17 February 2019
కెసిఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ; ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి అన్నారు. ఆదివారం కెసిఆర్ జన్మదినం సందర్భంగా రెబ్బెన గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పర్యావరణ కాపాడటంలో భాగస్వాములు కావాలని తెలంగాణ హరిత రాష్ట్రానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరి పుట్టిన రోజు చెట్టు నాటాలని ఈ సందర్భంగా సూచించారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ, ఉపసర్పంచు మడ్డి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన శ్రీధర్, నాయకులు జాకీ ఉస్మాని సుదర్శన్ గౌడ్ శాంతి కుమార్ గౌడ్, శంకర్, అశోక్, జహీర్ బాబా, వినోద్ జైస్వాల్, తిరుపతి, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ; రెబ్బెన మండలం పులికుంట గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా హాజరైన నాబార్డ్ అధికారి అంజన్న మాట్లాడుతూ ప్రజలు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ విధానం ద్వారా బహుళ ప్రయోజనాలున్నందున వాటిని వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. సంపాదించిన ప్రతి పైసాను దుబారా చేయకుండా పొదుపు పాటిస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామ సర్పంచ్ పోచమల్లు, వ్యవసాయ పరపతి సంఘం సి ఈ ఓ సంతోష్ , రైతులు , గ్రామస్తులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)