రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోకి అడవిలో ఉండే నీల్గాయి (అడవిజంతువు) గురువారం అకస్మాత్తుగా గోలేటి టౌన్‌షిప్‌లోకి వచ్చింది. అకస్మాత్తుగా ఇది కనబడడంతో ప్రజలు సంతోషానికి గురయ్యారు. దీనిని ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 4 July 2015
గోలేటిలో నీల్గాయి
రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోకి అడవిలో ఉండే నీల్గాయి (అడవిజంతువు) గురువారం అకస్మాత్తుగా గోలేటి టౌన్‌షిప్‌లోకి వచ్చింది. అకస్మాత్తుగా ఇది కనబడడంతో ప్రజలు సంతోషానికి గురయ్యారు. దీనిని ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు.
రెండవ రోజుకు చేరిన గ్రామ పం చాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
విద్యుత్ వైర్లు తగిలి మహిళ మృతి
రెబ్బెన : మండలంలోని చింగిలి గూడ గ్రామానికి చెందిన లావుడ్యా దాస్మబాయి (65) గురువారం విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలు తన పొలం లో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్థంబాలకున్న వైర్లు కిందికి వేలాడుతుండడంతో అవి ఆమె తలకు తగలడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా... విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నట్లు అధికారులకు ఎన్నోమార్లు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత వారం రోజుల క్రితం రెబ్బన్‌లోని ఇందిరా కాలనీ ఇళ్లపైనుంచి వెళుతున్న 11 కేవీ విద్యుత్ తీగెలు తెగి ఇళ్లమీదపడి మంటలు చెలరేగిన విషయం మరవకముందే మళ్లీ... ఈ సంఘటన జరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాం టి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రతిజ్ఞ చేయించిన తహసీల్దార్ రమేష్ గౌడ్
రెబ్బెన : డిజిటల్ భారత దేశ కార్యక్రమంపై మండల తహసీల్దార్ రమేష్‌గౌడ్ కార్యాలయం నందు కార్య సభ్యులు మరియు ప్రజలతో గురువారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అక్షరాస్యతను పొందుతూ మరియు ప్రజలను కూడా డిజటల్ అక్ష రాస్యులుగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పామూజిక మార్పు మరియు జ్ఞానాత్మక ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తానని నేను నా కోసం కాకుండా ప్రజల కోసం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని శక్తివంతంగా చేస్తానని ఆయన తెలిపారు
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె
రెబ్బెన: గ్రామ పంచాయతీలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ అన్నారు. బుధవారం రె బ్బెన మండలంలోని తసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవదిక సమ్మెను చేపట్టారు. సుధాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని కెటగిరిల కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, గ్రామపంచాయతీ సాధారణ ఆదాయంలో 30 శాతం సిబ్బందికి చెల్లించాలనే నిబంధన ఎత్తేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా పదో పీఆర్సీ 43 ఫిట్‌మెంట్‌తో కనీస వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సమ్మెను చేపపట్టామన్నారు. ఈ సమ్మె లో కార్మిక సంఘం మండలాధ్యక్షుడు ప్రకాశ్, డివిజన్ కమిటీ సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్న మిఠల్ నాయకులు బాబాజీ, అన్నాజి, సత్యనారాయణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Wednesday, 1 July 2015
పాఠశాలల బంద్ విజయవంతం
రెబ్బెన: వామపక్ష విద్యార్థి సంఘాల బుధవారం విజయవంతంమైందని, ఈ బంద్‌కు ప్రైవేటు, ప్రభుత్త పాఠశాలల యాజమాన్యాలు సహకరించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రమేశ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, టీవీ వీ జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవి, పార్వతిసాయి, నవతేజ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
హరితహారాన్ని విజయవంతం చేయండి
రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని అందరు విజయవంతం చేయాలని రెబ్బెన త హసీల్దార్ రమేశ్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఫారెస్ట్ నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడితేనే భావితరాలకు బం గారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులకు అవగాహన కల్పిస్తే గ్రామ గ్రామాల్లో హరితహారం విజయవంతమవుతుందని, దీని కోసం అధికారులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
మొక్కలు నాటిన జీఎం
రెబ్బెన : హరితహారంలో భాగంగా మంగళవారం సింగరేణీ పాఠశాల మైదానంలో బెల్లంపల్లి ఏరియా జీఎం రవి శంకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు పంపి ణీ చెెయడం జరుగుతుందని ప్రతీ వి ద్యార్థి, గ్రామ ప్రజలు, కార్మికులు మొక్కలు తీసుకుని నాటాలని అప్పుడే పర్యావరణాన్ని కాపాడవచ్చన్నారు
తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్
రెబ్బెన: హరితహారంలో కార్యక్రమంలో భాగంగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు వీడియోకాన్పరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎపీఎం రాజ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు హజరు కానున్నారని, మండల స్థాయి అధికారులు సకాలంలో హజరు కావాలని కోరారు.
సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జీఎం
రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ప్ర తీ ఒక్కరు విజయవంతం చేయాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు. మొక్కలు నాటాలనే నినాదంతో మంగళవారం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటీఓ జీఎం కొండయ్య, డీవై పిఎం సీతారాం, పీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎన్న సదాశివ్, ఏఐటీయూసీ గోలేటిబ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి , పర్యావరణ అధికారి క్రష్ణ మూర్తి, పాఠశాలల హెచ్ ఎం లు సంజీవ్ కుమార్, సుగునాకుమారి, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటండి పర్యావరణాని కాపాడండి
రెబ్బెన : ప్రతీ ఒక్కరు మొక్కలునాటి పర్యవరణాని కాపాడాలని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు. మంగళవారం గోలేటిలోని సింగరేని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పర్యావరణాని రక్షించుకుంటే భావీ తరాలకు భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం హర్షనీయం అన్నారు
Subscribe to:
Posts (Atom)