కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 18 : ప్రజలతో మమేకమై ఉన్నత సేవలందించాలని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం రెబ్బెన పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు అవుతున్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరుపై, కేసులు పరిష్కారంల అంశాలపై ఆరాతీశారు. నమోదవుతున్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు సలహాలు సూచనలను అందించారు. సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని నేరాల నియంత్రించడంతో పాటు జరిగిన నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడం పట్ల సిబ్బందికి సూచనలు అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు రాజకీయాల పార్టీలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. రెబ్బెన పోలీస్టేషన్ పరిధిలో జాతీయ రహదారి వెంట తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాల నడపకుండా విరివిగా డ్రంకైన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చటంతో పాటు రోడ్డు పక్కన ముళ్ల పొదలను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు అవగాహన కల్పించేందుకు కళాజాత బృందం ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళాజాత ప్రదర్శన ద్వారా చాలా గ్రామాల్లోని ప్రజలు మద్యానికి దూరం అవుతున్నారని ఇది శుభపరిణామమని అన్నారు. ప్రజలు నిర్భయంగా స్టేషన్ కు వచ్చి తమ సమస్యలను తెలసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, రెబ్బెన సిఐ వివి రమణమూర్తి ,ఎస్సై దీకొండ రమేష్లతో పాటు తదితర సిబ్బందులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment