కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 రెబ్బన ;; రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాంబయ్య, దుర్గం లక్ష్మి దంపతులు తమ పిల్లలైన దుర్గం జమున, దుర్గం పోచయ్య, దుర్గం శ్రీనివాస్ లతో కలసి పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. తమకు వారసత్వంగా రావలసిన జక్కుల పల్లి లో 18 ఎకరాలు, కిష్టాపూర్లో 10 ఎకరాలు, గుడిపల్లిలో 3 ఎకరాల భూమిని తమ పాలొల్లయిన దుర్గం మల్లయ్య, దుర్గం ప్రభాకర్ లు తమ పేరిట బదలాయించుకున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని చివరికి గత్యంతరం లేక ఈ విధంగా నిరసనను తెలిపినట్లు తెలిపారు. అధికారులు కల్పించుకొని న్యాయం చేయాలనీ కోరారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై శివకుమార్, తహసీల్దార్ సాయన్న బాధితుల సమస్యను తెలుసుకొని మంగళవారం పూర్తి పత్రాలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.
No comments:
Post a Comment