బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 127వ వర్ధంతి వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 28 : రెబ్బెన మండలం గోలేటిలో మహాత్మా జ్యోతిబాపూలే 127వ వర్ధంతి సందర్భంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఒరగంటి రంజిత్ మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు జ్యోతిబాపులే సామాజిక సేవలే కాకుండా మహిళల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, కింది జాతుల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడు , బడుగు బలహీన వర్గాలను చైతన్యపరచిన విప్లవజ్యోతి మతోన్మాదంపై నిరంతరం పోరాడుతూ వచ్చాడు. ఆయన పోరాట స్ఫూర్తికి మహాత్మ పూలే ని తన గురువుగా ప్రకటించుకున్నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిబాపూలే 1848 లొ మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యా ప్రదాత ప్రతి ఒక్కరు కూడా మహాత్మాజ్యోతి బాపులే ని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్ మరియు కార్యదర్శులు ఎగ్గ తిరుపతి, బల్గూరి తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment