Sunday, 31 May 2015

బడి బయటి పిల్ల్లల వివరాలు సేకరించాలి





రెబ్బెన : రెబ్బెన మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో డ్రాప్‌ అవుట్‌ విద్యార్థుల వివరాలు ఇంటింటా సర్వే చేసి సేకరించాలని మండల విద్యాధికారి, సాక్షర భారత్‌ మండల సమన్వయ కర్త సాయిబాబాలు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం వారు మాట్లాడుతూ... బడి మానేసిన పిల్ల్లల వివరాలను సేకరించాలన్నారు. రెండు రోజుల పాటు సర్వే నిర్వహించి జూన్‌ 2న సర్వే నివేదికలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచ ర్లు, సాక్షర్‌ భారత్‌ గ్రామ సమన్వయ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment